తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కాదు అది క్లియర్. కేంద్ర ఎన్నికల సంఘం కూడా టీడీపీని ప్రాంతీయ పార్టీగానే గుర్తించింది. అలాంటి టీడీపీని జాతీయ పార్టీగానే చెప్పుకుంటారు తమ్ముళ్ళు. కానీ ఆ పార్టీకి చంద్రబాబు అయితే జాతీయ ప్రెసిడెంట్. ఏపీ టీడీపీకి అచ్చెన్నాయుడు అధ్యక్షుడు.
దీని మీద స్పీకర్ తమ్మినేని సీతారాం వేసిన పంచులు తమ్ముళ్లకు దిమ్మతిరిగేలాగే ఉన్నాయి. టీడీపీకి ఖర్మ కాకపోతే అచ్చెన్న అధ్యక్షుడేంటి అని తమ్మినేని హాట్ కామెంట్స్ చేశారు. ఆ మాటకు వస్తే అచ్చెన్న ఏమైనా గొప్ప నాయకుడా అని ప్రశ్నించారు. ఆయన ఏ నేరం చేయకపోతే జైలుకు ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అచ్చెన్న అధ్యక్షుడు అని చెప్పి ఏపీలో చంద్రబాబే తెగ తిరుగుతున్నారని టీడీపీ పని అయిపోయిందని మాట్లాడుకోవడానికీ ఏమీ లేదు అనేశారు తమ్మినేని. ఏపీ ఆదాయాన్ని మొత్తం దోచిపెట్టి అమరావతి రాజధాని పేరిట సంపన్నున కోటను కట్టడానికి చంద్రబాబు సృష్టికర్త అవతారం ఎత్తారని తమ్మినేని విమర్శించారు.
విశాఖ కంటే ఏపీలో పెద్ద సిటీ ఉందా దాన్ని రాజధాని చేస్తామంటే ఎందుకు ఒప్పుకోరని ఆయన టీడీపీ వారిని నిలదీస్తున్నారు. టీడీపీ పని అయిపోయిందని, అచ్చెన్న అధ్యక్షుడేంటి అని తమ్మినేని సైకిల్ గాలి తీసేశారు.