నిన్నటికినిన్న హీరోయిన్ మంజిమా మోహన్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. హీరో గౌతమ్ కార్తీక్ తో తను పీకల్లోకు ప్రేమలో ఉన్నట్టు ప్రకటించింది. ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లి కబురు మోసుకొచ్చింది. కోలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న హన్సిక, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ 4న హన్సిక పెళ్లి ఉంటుంది. ఇంతకీ ఆమె కాబోయే భర్త ఎవరో తెలుసా? అతడి పేరు సోహైల్ కటూరియా. చాన్నాళ్లుగా హన్సిక-సోహైల్ స్నేహితులు. ఆ తర్వాత ఇద్దరూ బిజినెస్ పార్టనర్స్ గా కూడా మారారు. ఇద్దరూ కలిసి పలు వ్యాపారాలు చేశారు. అదే టైమ్ లో ఇద్దరూ ప్రేమలో పడ్డారు.
డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసింది ఈ జంట. తాజా సమాచారం ప్రకారం జైపూర్ లో హన్సిక పెళ్లి చేసుకోబోతోంది. ఈ మేరకు ఓ స్టార్ హోటల్ తో పాటు, రిసార్ట్ ను వీళ్లు బుక్ చేశారు. చాలామంది హీరోయిన్లలా హన్సిక కూడా ఈ పెళ్లిని ఇండస్ట్రీకి దూరంగా, కుటుంబ సభ్యుల మధ్య చేసుకోబోతోంది.
హన్సిక నటించిన మై నేమ్ ఈజ్ శృతి, 105, పార్టనర్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరో 5 సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను కొనసాగించబోతోంది ఈ బ్యూటీ.