“మీరు సింగిల్ గా ఉన్నారా.. లేక లవ్ లో ఉన్నారా?” ఇది చాలా చిన్న ప్రశ్నలా కనిపించొచ్చు. కానీ హీరోయిన్లు దీనికి ఆన్సర్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. చాలామంది ఎందుకొచ్చిన గొడవ అని సింగిల్ అనేస్తారు. మరికొంతమంది మాత్రం ప్రేమలో ఉన్నామని ఒప్పుకుంటారు. ఇంకొంతమంది తమకు ఓ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కూడా చెబుతారు.
కానీ అను ఎమ్మాన్యుయేల్ మాత్రం ఈ విషయంపై స్పందించడానికి చాలా ఇబ్బంది పడింది. తను సింగిల్ గా ఉన్నానా లేక ఎవరితోనైనా ప్రేమలో ఉన్నానా అనే విషయాన్ని చెప్పలేకపోయింది. తను సింగిల్ గా లేనని, అలా అని ప్రేమలో కూడా ఉన్నట్టు కాదని తెలిపింది ఈ బ్యూటీ.
అటు హీరో అల్లు శిరీష్ మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. అను ఎమ్మాన్యుయేల్ ప్రేమలో ఉందని తనకు తెలుసని, ఎప్పుడు చూసినా అను తన మొబైల్ చూసుకొని ముసిముసిగా నవ్వుకుంటుందని, కొన్ని సార్లు సిగ్గుపడుతుందని, ప్రేమలో ఉన్నవాళ్లే ఇలా చేస్తారని అంటున్నాడు.
అను ఎమ్మాన్యుయేల్ ప్రేమలో ఉన్నట్టు గతంలోనే రూమర్లు వచ్చాయి. అప్పట్లో వాటిని ఆమె ఖండించలేదు. తాజాగా మరోసారి ఆమె ఈ వార్తల్ని ఖండించలేదు.