మామను ఎక్కడైనా అల్లుడు గౌరవించాలి. ఆయన పెద్దరికానికి పడిపడి దండాలు పెట్టాలి. కానీ ఇక్కడంతా రివర్స్ గేర్. ఆయన అనుభవానికి ప్రస్తుతం ఉన్న పదవికి, అన్నింటికీ మించి వయసుకు కూడా ఎక్కడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడుత్న్నాటంటే అతను కచ్చితంగా పసి కూన మాత్రమే అవుతాడు.
అయితే ఇక్కడ ఉన్నది అలాంటి ఇలాంటి కూన కాదు, పచ్చ పార్టీ రాజకీయ కూన. అందుకే ఆయన ప్రత్యర్ధులు ఎవరైనా ఒకటే అన్నట్లుగా దూకుడుగా వెళ్తున్నారు. తన మాటలతో, చేతలతో ప్రతీ రోజూ వార్తల్లోకి వస్తున్నారు. తాజాగా కూన రవికుమార్ తన సొంత మేనమామ, వైసీపీ నేత, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీద చేసిన కామెంట్స్ ఇపుడు హీట్ పుట్టిస్తున్నాయి.
రోడ్డు మీద మామను నడిపిస్తారట. జాగ్రత్త మామ ఇక చూసుకోమని వార్నింగులు కూడా ఇస్తున్నారు. మరి ఆయన్ని ఏమనుకున్నారో, పైగా అధికారం ఇంకా చంద్రబాబు వద్దనే ఉందని భ్రమిస్తున్నారా, తానింకా ఎమ్మెల్యేనని ఆలోచిస్తున్నారా. మొత్తానికి ఓడి ఏడాది అయినా కూన దర్జా, దర్పం ఎక్కడా తగ్గలేదుగా.
అధికారులు, నాయకుల మీద నుంచి ఇపుడు ఏకంగా స్పీకర్ తమ్మినేని మీదనే పడ్డారని అంటున్నారు. మూడుసార్లు అరెస్ట్ అయినా కూడా కూన మారలేదని వైసీపీ నేతలు అంటున్నారంటే ఆయన తగ్గాలి కదా. కానీ దానికి భిన్నంగా తనను ఓడించి గెల్చిన మేనమామ తమ్మినేని మీదకే సై అంటున్నారు. మరి స్పీకర్ వంటి రాజ్యాంగబధ్ధ పదవిలో ఉన్న వారి మీద నోరు చేసుకుంటున్నారు. పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.