అయ్య బాబోయ్‌…ఆయ‌న అజ్ఞానం అపారం!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానీకం చైత‌న్యంపై చాలా చిన్న‌చూపుంది. ఏపీ ప్ర‌జానీకానికి చైత‌న్యం చెప్ప‌లేద‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించి ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న అజ్ఞానాన్ని త‌న‌కు తానుగానే చాటుకున్నారు. ఓ పార్టీ అధినేత ఇలా ప్ర‌జ‌ల‌ను కించ‌ప‌రిచేలా…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానీకం చైత‌న్యంపై చాలా చిన్న‌చూపుంది. ఏపీ ప్ర‌జానీకానికి చైత‌న్యం చెప్ప‌లేద‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించి ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న అజ్ఞానాన్ని త‌న‌కు తానుగానే చాటుకున్నారు. ఓ పార్టీ అధినేత ఇలా ప్ర‌జ‌ల‌ను కించ‌ప‌రిచేలా ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం ప‌వ‌న్‌కే చెల్లింది. రెండుసార్లు త‌న‌ను ఓడించినా ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజ చైత‌న్యం గురించి అర్థం చేసుకోక‌పోవ‌డం ఆయ‌న అపార తెలివిత‌క్కువ త‌నానికి నిద‌ర్శ‌న‌మ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇవాళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవ‌త‌ర‌ణ దినం. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ శుభాకాంక్ష‌లు చెప్పారు. వివ‌క్ష‌ను భ‌రించ‌లేక పొట్టి శ్రీ‌రాములు నాడు ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టార‌ని, ప్రాణాలు ప‌ణంగా పెట్టి, తెలుగు రాష్ట్రాన్ని సాధించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇంత వ‌ర‌కైతే ఎవ‌రికీ పేచీ లేదు. ఆ త‌ర్వాత ఆయ‌న చేసిన కామెంట్ తీవ్ర విమ‌ర్శ‌ల‌కు గురి చేస్తోంది.

ఆ చైతన్యం ఆంధ్రప్రదేశ్ వాసులలో ఈనాడు ఏమైందని ప‌వ‌న్ ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రం అతలాకుతలం అయిపోతున్నా ఎందుకు స్పందన కరవైందని ఆయ‌న నిల‌దీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోతున్నా, ప్రాజెక్టులు తరలిపోతున్నా పాలకులు ఎందుకు ప్రశ్నించరని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. త‌న‌కు న‌చ్చిన చంద్ర‌బాబును గ‌ద్దె ఎక్కిస్తే మాత్రం ప‌వ‌న్ దృష్టిలో ఏపీ చైత‌న్య‌వంత‌మైన స‌మాజ‌మా? అని నెటిజ‌న్లు, ప్ర‌త్య‌ర్థులు నిల‌దీస్తున్నారు.

గ‌తంలో టీడీపీ, బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లికి, అధికారంలోకి రావ‌డానికి స‌హ‌క‌రించిన విష‌యాన్ని ప్ర‌త్య‌ర్థులు గుర్తు చేస్తున్నారు. చంద్ర‌బాబు నేతృత్వంలో సాగిస్తున్న అరాచ‌క పాల‌న‌ను ఎప్పుడైనా ప‌వ‌న్ ప్ర‌శ్నించారా? అని నిల‌దీస్తున్నారు. ప్ర‌జావ్య‌తిరేక పాల‌కుడైన చంద్ర‌బాబుతో అంట‌కాగినందునే  రెండు చోట్ల జ‌నం ఓడించి, త‌న చైత‌న్యాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం చాటుకుంద‌ని నెటిజ‌న్లు ప‌వ‌న్‌కు హిత‌వు చెబుతున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మ‌కానికి పెట్టిన పార్టీతో పొత్తులో వుంటూ, మ‌రోవైపు మ‌రెవ‌రినో ప్ర‌శ్నించ‌డం ప‌వ‌న్‌కే చెల్లింద‌ని నెటిజ‌న్లు దుయ్య‌బ‌ట్టారు. ప‌వ‌న్‌కు ద‌మ్ము, ధైర్యం వుంటే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌శ్నించ‌డానికే జ‌న‌సేన పార్టీ పెట్టాన‌ని చెబుతున్న పెద్ద మ‌నిషి, ఇప్పుడు ఏపీ ప్ర‌జానీకంలో స్పంద‌న లేద‌ని, చైత‌న్యం కొర‌వ‌డింద‌ని నిల‌దీయ‌డం చూస్తుంటే… పిచ్చి పీక్‌కు చేరింద‌ని నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు.