ఎఫ్ 3..ఓవర్ సీస్ లెక్కలు

యుఎస్ లో బ్రేక్ ఈవెన్ అయిందని ఎఫ్ 3 జనాలు..అది ఎలా పాజిబుల్ అంటూ మరి కొందరు కిందా మీదా అయిపోతున్నారు.  Advertisement అసలు ఓవర్ సీస్ లో ఎఫ్ 3ని ఎంతకు అమ్మారు.…

యుఎస్ లో బ్రేక్ ఈవెన్ అయిందని ఎఫ్ 3 జనాలు..అది ఎలా పాజిబుల్ అంటూ మరి కొందరు కిందా మీదా అయిపోతున్నారు. 

అసలు ఓవర్ సీస్ లో ఎఫ్ 3ని ఎంతకు అమ్మారు. ఇది క్లారిటీ లేని ప్రశ్న. ఎందుకంటే భీమ్లా నాయక్, ఆచార్య, ఎఫ్ 3 కలిపి 18 కోట్ల మేరకు యుఎస్ బయ్యర్ కొన్నారు. 

భీమ్లా నాయక్ రెండున్నర మిలియన్ల మేరకు చేసింది. ఆచార్య మిలియన్ దగ్గరగా వెళ్లింది. అంటే మిగిలిన భారం అంతా ఎఫ్ 3 మీదనే వుంది.

అయిదు మిలియన్లు చేస్తే చాలు 18 కోట్లు వచ్చేస్తాయి అనుకున్నా ఎఫ్ 3 మీద వన్ అండ్ హాఫ్ మిలియన్ భారం వుంది. ఈ లెక్కన చూసుకుంటే యుఎస్ లో ఇంకా బ్రేక్ ఈవెన్ కావాల్సి వుంది. లేదూ అయిదు మిలియన్లు చేస్తే 18 కోట్ల షేర్ రావడం కష్టం మరి కొద్దిగా చేయాలి అంటే ఎఫ్ 3 బ్రేక్ ఈవెన్ కు ఇంకా దూరం.

ఈ సమస్య ఎందువల్ల అంటే ఆచార్య ఇచ్చిన షాక్ వల్ల. ఆచార్య కనుక మరో మిలియన్ చేసి వుంటే యుఎస్ బయ్యర్ కు లాభాలు వచ్చి వుండేవి.