ఎద్దున్నొడికి బుద్ది లేదు బుద్దున్నొడికి ఎద్దు లేదు

కరోనా వైరసుని ఎదుర్కోవడంలో అర్థమయ్యేదేంటంటే…అమెరికాకు మంచి హాస్పిటల్స్, హెల్త్ కేర్ సిస్టమ్స్ ఉన్నాయి కానీ 50% ప్రజలకు మూర్ఖత్వం ఉంది. సగం మంది ప్రజలు గవర్నమెంట్ కానీ, డాక్టర్లు గానీ చెప్పాల్సిన అవసరం లేకుండానే…

కరోనా వైరసుని ఎదుర్కోవడంలో అర్థమయ్యేదేంటంటే…అమెరికాకు మంచి హాస్పిటల్స్, హెల్త్ కేర్ సిస్టమ్స్ ఉన్నాయి కానీ 50% ప్రజలకు మూర్ఖత్వం ఉంది. సగం మంది ప్రజలు గవర్నమెంట్ కానీ, డాక్టర్లు గానీ చెప్పాల్సిన అవసరం లేకుండానే మాస్కులు పెట్టుకుని సామాజిక దూరం పాటించుకుంటు, అనవసరంగా ఇళ్లలోంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, మిగిలిన సగం వితండవాదం చేసుకుంటూ అజాగ్రత్తగా ఉంటూ మాస్కులు పెట్టుకోకుండా సామాజిక దూరం పాటించకుండా వాళ్లకు వాళ్ళు చేటు చేసుకోవడం తోబాటు మిగిలిన వాళ్లకు కూడా చేటు చేస్తున్నారు. మాస్కులు పెట్టుకోమనడం  స్వేచ్ఛను హరించడమని కొందరు, మత విశ్వాసానికి భంగం అంకె కొందరూ వాదించడం నిజమైన మూర్ఖత్వమే కాకుండా అమానుషం కూడా! 

దీని పర్యవసానం గత వారంగా ప్రతిరోజూ రికార్డులు సృష్టిస్తున్నది అమెరికా – కేసుల సంఖ్యలో ట్రంప్, తన పక్కనుండే మూర్ఖ ముష్కరులు జనవరి నుండి కొంచెం జాగ్రత్తగా ఉండి మత విశ్వాసంతో కాకుండా సైన్స్ పై నమ్మకంతో నిపుణులు చెప్పేది విని, అధ్యక్ష ఎన్నికల కోసం అబద్ధాలు చెప్పకుండా దేశ ప్రజల రక్షణకు కావలసిన చర్యలను తీసుకుని ఉంటే అత్యంత ఆధిక్యతతో గెలిచి ఉండేవాళ్ళు. 

ట్రంప్ తన స్వార్థంతో కూడిన మూర్ఖత్వంతో నేడు ఓటమి అంచుల్లో ఉన్నాడని సర్వేలు చెవుతున్నాయి.. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు అమెరికాలో సంభవించి, ఐదు కోట్ల మందికి ఉద్యోగాలు పోయి దేశ ఆర్థిక వ్యవస్థ రెండొందల ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో చిక్కుకుంది. ట్రంపు లాంటి వ్యక్తి ఈ వినాశవేళ అధ్యక్షుడిగా ఉండటం అమెరికాకే కాకా యావత్ ప్రపంచానికి కరోనా ముప్పుని ఎన్నో రెట్లు పెద్దది చేసింది. సాధారణంగా ప్రపంచానికి ముప్పులు వచ్చినపుడు అమెరికా నాయకత్వం చాలా ప్రయోజానంగా ఉండేది కానీ ఇప్పుడు అమెరికాకు ఎద్దుంది కానీ బుద్ది లేదు. 

భారత దేశానికి మంచి హాస్పిటల్స్, హెల్త్ కేర్ సిస్టమ్స్ లేవు, అలాగే మంచి ప్రభుత్వ వ్యవస్థలు లేవు. మనకున్న సమాచారం ప్రకారం జనవరి రెండో వారంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ ప్రధాని మోడీ, ఇతర ప్రభుత్వ పెద్దల సమావేశంలో లాక్ డౌన్ వెంటనే పెట్టాలని అర్ధించింది. కానీ, ఇక్కడ కూడా ట్రంపే భారత దేశానికి చేటు చేశాడు. ఫిబ్రవరి 24న భారత్ వస్తున్న సందర్భంగా బీజేపీ ప్రభుత్వం లాక్ డౌనుకు ఒప్పుకోకుండా ఆలస్యం చేసి విదేశీ ప్రయాణికుల రాకను ఆపలేదు. ఈలోపు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఒక బృహత్తర కార్యక్రమాన్ని పూర్తిచేశారు. వీటిని కూడా ఎద్దు ఉంది కానీ బుద్ది లేదు కిందే జమకట్టాలి.

భారత దేశంలో నిరక్షరాస్యత, అజ్ఞానం, అమాయకత్వం పలుపాళ్ళలో ఉంది కానీ ప్రభుత్వం, వ్యవస్థలు అర్ధమయ్యేటట్టు చెపితే వినేవాల్లే అత్యధికం. మాస్కులు పెట్టుకుంటేనే కరోనా వ్యాధి రాదు అంటే మిక్కిలిగా పెట్టుకుంటారు. మా స్వతంత్రం కాకరకాయ అని వాదించేవాల్లు చాలా తక్కువ. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నా, పూటకు గడవటం కష్టమవుతున్నా సహకరించే వాళ్ళే ఎక్కువ. ఒక 10% మాత్రం జాగ్రత్తలు తీసుకొని వారు ఉండి ఉంటారు ఈ టెన్ పర్సెంట్ సమస్య ఎప్పుడూ ఉండేదే.. కానీ ఎక్కువమంది ప్రమాదాన్ని గుర్తించి జాగ్రత్త పడ్డారు. ఆర్థికంగా వెసులుబాటు లేకపోయినా దేశ ప్రజలు త్యాగాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. దీన్నే ఎద్దు లేదు కానీ బుద్ది ఉందని అంటారు.

గురవా రెడ్డి, అట్లాంటా

చంద్రబాబు బాకీలు తీరుస్తున్న జగన్

ఐదుసార్లు ట్రైచేసి నావల్లకాక వదిలేసాను