సెలబ్రిటీలకు అడ్వర్ టైజ్ మెంట్ల ద్వారా మాంచి ఆదాయం వస్తుందన్న సంగతి తెలిసిందే. టాప్ హీరోలు బ్రాండ్ అంబాసిడర్లుగా వుండి బాగానే సంపాదిస్తారు.
అయితే ఇలా కంపెనీలకు ప్రకటనలు చేయాల్సి వచ్చినపుడు వాటిని డైరక్ట్ చేసే అవకాశం మాత్రం తమకు ఇష్టమైన డైరక్టర్లకు ఇస్తారు. ఆ విధంగా వారిని తమకు దగ్గర చేసుకుంటారు.
హీరోలకు కోట్లలో యాడ్ రెవెన్యూ వుంటే డైరక్టర్లకు ఎంత వుంటుంది? అన్నది క్వశ్చను. ఈ మధ్యనే త్రివిక్రమ్-ఎన్టీఆర్, త్రివిక్రమ్-మహేష్ కలిసి ప్రకటనలు చేసారు. అలాగే మహేష్-సందీప్ వంగా కలిసి ఓ యాడ్ చేసారు.
ఈ యాడ్ లు చేయడం అంతా కలిపి వన్ డే వర్క్. పైగా స్క్రిప్ట్ బేసిక్ ఐడియా కంపెనీలే ఇస్తాయి. అందువల్ల మరీ తల బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఇలా ఓ ప్రకటన చేయడానికి త్రివిక్రమ్ 30 లక్షలు తీసుకుంటారని బోగట్టా.
సందీప్ వంగాకు మాత్రం ఇచ్చింది అటు ఇటుగా అయిదు లక్షలే అని తెలుస్తోంది. జస్ట్ ఓ పూట క్రియేటివిటీ వర్క్ కు 30 లక్షలు ఆదాయం అంటే మంచి చాన్స్ నే. కానీ ఆ చాన్స్ ఇవ్వాల్సింది మాత్రం హీరోలే.