రావడమే సంచలన విజయంతో వచ్చింది. ఆమె యాక్టింగ్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. దీంతో పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ లో మంచి పొజిషన్ కు వెళ్తుందని అంతా ఊహించారు. కానీ ఆ వెంటనే ఐటెంసాంగ్ కు ఓకే చెప్పింది పాయల్. ఇక్కడే కొంతమందికి కొన్ని అనుమానాలు రేకెత్తాయి. తాజాగా విడుదలైన ఆర్డీఎక్స్ లవ్ అనే సినిమా టీజర్ చూసిన తర్వాత అందరి అనుమానాలు తొలిగిపోయాయి.
ఈమధ్య బోల్డ్ పేరుతో తెలుగులో చాలా సినిమాలే వస్తున్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా పూర్తిస్థాయి అడల్ట్ సినిమాగా తెరకెక్కింది ఆర్డీఎక్స్ లవ్ మూవీ. కంట్రోల్ యువర్ ఫీలింగ్స్, సేఫ్టీ, అపరిచితుడితో సెక్స్ చేశారా లాంటి డైలాగ్స్ వింటేనే సినిమా జానర్ ఏంటి, పాయల్ ఎలాంటి పాత్ర పోషించిందనే విషయం అర్థమౌతూనే ఉంది.
ఇకపై ఈమెకు తెలుగులో ఇలాంటి బోల్డ్ మూవీ ఛాన్స్ లే వస్తాయి తప్ప, బడా సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవచ్చు. వెంకీమామ, డిస్కోరాజా సినిమాలే ఆమె చేస్తున్న చివరి స్టార్ ప్రాజెక్టులు అవ్వొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఐటెంసాంగ్ చేసిన పాయల్, ఆర్డీఎక్స్ లవ్ టైపులో ఇంకొక్క సినిమా చేస్తే చాలు, బడా హీరోలకు పూర్తిగా దూరమవ్వడం ఖాయం.
అటు పాయల్ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు లేదు. ఆమె పెడుతున్న ఫొటోలు, ట్వీట్లు చూస్తేనే తను ఎలాంటి ఇమేజ్ కోరుకుంటుందో అర్థమౌతూనే ఉంది. నిజానికి టాలీవుడ్ లో ఇప్పుడున్న గ్యాప్ ను భర్తీ చేయడానికి పాయల్ కు ఆర్ఎక్స్100 రూపంలో మంచి అవకాశం దొరికింది. కానీ బోల్డ్ అంటూ ఆమె తన కెరీర్ ను మరో దారిలోకి తీసుకెళ్తోంది. క్రేజీ హీరోయిన్ అవుతుందనుకున్న ముద్దుగుమ్మ కాస్తా హాట్ బాంబ్ గా మారిపోయింది.