విశాఖ రాజధాని.. అప్పుడు అడగలేదేం గంటా!

తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తను మంత్రిగా ఉన్నప్పుడు చేయని డిమాండ్ ను ఇప్పుడు తెరమీదకు తెస్తున్నారు గంటా శ్రీనివాసరావు. విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించాలంటూ ఆయన డిమాండ్ చేసేశారు.…

తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తను మంత్రిగా ఉన్నప్పుడు చేయని డిమాండ్ ను ఇప్పుడు తెరమీదకు తెస్తున్నారు గంటా శ్రీనివాసరావు. విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించాలంటూ ఆయన డిమాండ్ చేసేశారు. ఒకవైపు చంద్రబాబు నాయుడేమో అమరావతి నుంచి రాజధానిని మారుస్తున్నారంటూ గగ్గోలు పెడుతూ ఉన్నారు.

అక్కడ రాజధానిగా ఉన్నది ఏమీలేకపోయినా.. చంద్రబాబు నాయుడు మాత్రం తెగ ఇదైపోతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించాలంటూ డిమాండ్ చేయడం గమనార్హం. అమరావతి నుంచి రాజధాని అనేమాటను అంగుళం కదిల్చినా సహించమంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లు అంటున్నారు. అందుకు భిన్నంగా మాట్లాడారు గంటా.

ఇక ఈ విషయం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించాలని, ప్రజల్లో అయోమయం తొలగించాలని కూడా గంటా కోరారు. అమరావతిలో భూ కుంభకోణం జరిగి ఉంటే ప్రభుత్వం తేల్చాలని కూడా గంటా ఉచిత సలహా ఇచ్చారు.

అమరావతి కోసం అప్పట్లో భారీగా ఖర్చు కూడా పెట్టారని చెప్పుకొచ్చారు. మరి అంత ఖర్చుపెట్టి ఉంటే ఇప్పుడు మళ్లీ విశాఖను ఆర్థిక రాజధాని అంటూ డిమాండ్ ఎందుకు చేస్తున్నట్టో!

జనం విజ్ఞతను తక్కువగా చూస్తే పవన్‌కే నష్టం