చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. తిరుగులేని బ్యాక్ గ్రౌండ్ తో హీరో అయ్యాడు. రీసెంట్ గా ఓ హిట్ కూడా కొట్టాడు. ఇప్పుడు ఓ ఎన్నారై అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అవును.. ఆ స్టార్ హీరో వ్యక్తిగత జీవితంపైనే ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… తన బాస్ కు చిన్న ఎఫైర్ స్టార్ట్ అయిందంటూ స్వయంగా ఆ హీరో మేనేజర్ మేటర్ లీక్ చేయడం.
నిజానికి సదరు హీరోకు ఇలాంటి ఎఫైర్స్ కొత్తేంకాదు. అదేంటో కెరీర్ స్టార్టింగ్ నుంచి అతడిపై ఇలాంటి పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. చాలామంది హీరోయిన్లతో లింక్ పెడుతూ అతడిపై చాలా గాసిప్స్ వచ్చాయి. కానీ వాటన్నింటినీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చాడు ఆ హీరో. కానీ ఇది మాత్రం అతడి వృత్తి జీవితంలో సంబంధం లేని ఎఫైర్. పూర్తి పర్సనల్.
ఈ హీరో ఆమధ్య అమెరికా వెళ్తే అంతా మేకోవర్ కోసం అనుకున్నారు. కట్ చేస్తే, హైదరాబాద్ లో మళ్లీ సేమ్ గెటప్ తోనే కనిపించాడు. అప్పుడు అతడు అమెరికా వెళ్లింది తన “రహస్య స్నేహితురాల్ని” కలిసేందుకే అనే విషయం తాజాగా బయటపడింది. నిజానికి ఆ హీరో కుర్రాడేం కాదు. ఎప్పుడో 30 దాటేశాడు. కావాలనుకుంటే తన లవ్ లైఫ్ ను ఆయన బయటపెట్టొచ్చు.
సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకుంటానంటే అడ్డుచెప్పే వ్యక్తులు కూడా ఆ కుటుంబంలో లేరు. కానీ ఎందుకో ఈ విషయాన్ని అతడు రహస్యంగా ఉంచుతున్నాడు. అదే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవ్వరికీ అంతుచిక్కకుండా ఉంది. సదరు హీరో ఎప్పుడు బయటపడతాడో ఏంటో!