సాహో అంచనా.. కళ్లు చెదిరే ఫస్ట్ డే కలెక్షన్?

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి వచ్చేస్తోంది సాహో. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి సాహో సినిమా ఆ అంచనాల్ని అందుకుంటుందా.. వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందా..…

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి వచ్చేస్తోంది సాహో. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి సాహో సినిమా ఆ అంచనాల్ని అందుకుంటుందా.. వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందా.. మొదటిరోజు ఈ సినిమాకు ఎంత వస్తుంది..? ఎక్కడ చూసినా ఇప్పుడిదే చర్చ. దీనికి తమదైన రీతిలో సమాధానం చెబుతున్నారు ట్రేడ్ ఎనలిస్టులు.

తాజా అంచనాల ప్రకారం.. సాహో సినిమాకు ఇండియాలో 70 కోట్ల రూపాయల (నెట్) వరకు వసూళ్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదేకనుక జరిగితే చాలా రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాకు తొలిరోజు ఇండియా అంతటా 52 కోట్ల 25 లక్షల రూపాయల నెట్ వచ్చింది. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ కు ఏకంగా 53 కోట్ల రూపాయలు వచ్చాయి. హ్యాపీ న్యూ ఇయర్ అనే సినిమాకు 45 కోట్ల రూపాయలు వచ్చాయి. సాహోకు కనుక 70 కోట్లు వస్తే.. ఈ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి.

కానీ బాహుబలి-2 రికార్డును క్రాస్ చేయడం మాత్రం సాహో వల్ల కాకపోవచ్చని అంటున్నారు ట్రేడ్ పండిట్స్. బాహుబలి-2 సినిమాకు మొదటిరోజు ఇండియాలో 121 కోట్ల రూపాయలు వచ్చాయి. ఒక్క హిందీ వెర్షన్ కే 41 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ రికార్డుల్ని సాహో క్రాస్ చేయడం కాస్త కష్టమైన వ్యవహారమనే చెప్పాలి. సాహో హిందీ వెర్షన్ కు 25 కోట్ల రూపాయల వరకు రావొచ్చనేది ఓ అంచనా. అయితే ఓవరాల్ గా వసూళ్ల పరంగా చూసుకుంటే.. మొదటిరోజు వసూళ్లలో బాహుబలి-2 తర్వాత స్థానంలో సాహో నిలిచే అవకాశం ఉంది.

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే.. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్ గా కూడా ఇది నిలవనుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. బాహుబలి-2 సినిమాకు ఏపీ, నైజాంలో మొదటి రోజు ఏకంగా 42 కోట్ల 43 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ రికార్డును సాహో క్రాస్ చేస్తుందా చేయదా అనే అంశం ఇంట్రెస్టింగ్ గా మారింది. నైజాంలో మాత్రం బాహుబలి-2ను సాహో క్రాస్ చేయడం గ్యారెంటీ అంటోంది ట్రేడ్. నైజాంలో బాహుబలి-2కు మొదటిరోజు 8 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ మార్క్ ను సాహో ఈజీగా క్రాస్ చేస్తుందని అంతా భావిస్తున్నారు.

తొలిరోజు 10 కోట్లు షేర్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. ఇదేకనుక సాకారమైతే నైజాంలో సాహో ఓ పెద్ద చరిత్ర సృష్టించినట్టే. మొదటి రోజే రెండంకెల షేర్ అంటే మాటలు కాదు. తెలుగు రాష్ట్రాల్లో 1500కు పైగా స్క్రీన్స్ పై రిలీజ్ అవుతోంది సాహో. అటు తమిళనాట ఈ సినిమాకు 550కు పైగా థియేటర్లు దక్కాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ 6000కు పైగా స్క్రీన్స్ పై రిలీజ్ అవుతోంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా రిజల్ట్ బయటకు రాబోతోంది.

జనం విజ్ఞతను తక్కువగా చూస్తే పవన్‌కే నష్టం