ఎంపీతో హీరోయిన్ పెళ్లి.. డేట్ ఫిక్స్

హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లికి డేట్ ఫిక్స్ అయింది. వచ్చేనెల 25న వీళ్ల వివాహం జరగనుంది. వీళ్లు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడం లేదు. ఉదయ్ పూర్ లోని ఓ…

హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లికి డేట్ ఫిక్స్ అయింది. వచ్చేనెల 25న వీళ్ల వివాహం జరగనుంది. వీళ్లు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడం లేదు. ఉదయ్ పూర్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో వీళ్ల పెళ్లి జరుగుతుంది.

మరో 2 వారాల్లో తమ కమిట్ మెంట్స్ అన్నీ పూర్తి చేయబోతోంది పరిణీతి. ఆ తర్వాత పూర్తిగా పెళ్లిపై ఫోకస్ పెట్టనుంది. అంతేకాదు, పెళ్లి ఏర్పాట్లను కూడా పరిణీతి దగ్గరుండి చూసుకోనుంది. ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ వీళ్ల వివాహానికి వేదిక కానుంది.

భారీ ఫంక్షన్లకు ఉదయ్ విలాస్ పెట్టింది పేరు. అంబానీ కూతురు ప్రీవెడ్డింగ్ వేడుకలు ఇందులోనే జరిగాయి. గ్రామీ అవార్డ్ గ్రహీత, పాప్ సింగర్ బియాన్స్ కచేరీ కూడా ఇందులోనే జరిగింది. ఇప్పుడీ వేదికపై పరిణీతి-రాఘవ్ పెళ్లి జరగబోతోంది.

కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు పరిణీతి-రాఘవ్. కాలేజీలో ఇద్దరూ క్లాస్ మేట్స్. ఆ తర్వాత లవర్స్ గా మారారు. ఈమధ్యే తమ ప్రేమను బయటకు వెల్లడించారు. ఆ వెంటనే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. వచ్చే నెలలో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ పెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరగనుంది. పెళ్లి తర్వాత గురుగ్రామ్ లో భారీగా రిసెప్షన్ ప్లాన్ చేశారు. ఈ రిసెప్షన్ కు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరవుతారని తెలుస్తోంది.