టాలీవుడ్ హీరోలు తీసుకునే రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో, వాళ్ల మెయింటెనెన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. కాళ్లకు వేసుకునే షూ నుంచి తలపై పెట్టుకునే టోపీ వరకు అన్నింటిలో ది బెస్ట్ ఉంటారు. సెలబ్రిటీలు వేసుకునే దుస్తులు, యాక్ససిరీస్ ధరల్ని గెస్ చేయడం చాలా కష్టం. ఒక్కోసారి ఆ రేట్లు చూస్తే కళ్లు తిరుగుతాయి.
రీసెంట్ గా మహేష్ బాబు మీడియా ముందుకొచ్చాడు. ఎప్పట్లానే చాలా సింపుల్ గా, కూల్ గా కనిపించాడు. అయితే అతడు వేసుకున్న దుస్తులు మాత్రం అంత సింపుల్ కావు. వాటి ధరలు ఏమాత్రం కూల్ కాదు. అవును.. నిన్న జరిగిన ఓ ఫంక్షన్ లో మహేష్ బాబు వేసుకున్న చొక్కా ఖరీదు అక్షరాలా 17,999 రూపాయలు. ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ కు చెందిన షర్ట్ ఇది.
మహేష్ యాక్ససిరీస్, దుస్తులపై చర్చ ఇప్పటిది కాదు. ప్రతి సినిమాకు ఈ చర్చ కామన్ గా జరిగేదే. 'భరత్ అనే నేను' సినిమా కోసం మహేష్ వైట్ షర్ట్ వేసుకుంటే, దానిపై ఓ రేంజ్ లో చర్చ జరిగింది. ఇక మహర్షి సినిమాలో కాలేజీ ఎపిసోడ్ లో మహేష్ వేసుకున్న దుస్తులు, యాక్ససిరీస్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఇప్పుడు వేసుకున్న చొక్కా కూడా గుంటూరుకారం కోసం వాడుతున్న డిజైన్లలో ఒకటి. దీనికి సంబంధించి ఆ సినిమాలో మహేష్ స్టిల్స్ ను రిఫరెన్స్ గా చూపిస్తున్నారు ఫ్యాన్స్.
మొన్నటికిమొన్న బ్రో సినిమా కోసం పవన్ కల్యాణ్ వేసుకున్న వెరైటీ షూ హాట్ టాపిక్ గా మారింది. దాని రేటు చూసి నోరెళ్లబెట్టారు జనం. ఇప్పుడు మహేష్ వేసుకున్న షర్ట్ కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది.