యువి భారీ సినిమా ప్రకటన రేపు

యువి సంస్థ నుంచి భారీ సినిమా ప్రకటన వచ్చి చాలా కాలం అయింది. సాహో.. రాధేశ్యామ్ సినిమాల తరువాత చేయబోయే భారీ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రేపు రాబోతోంది. మెగాస్టార్ చిరు బర్త్ డే…

యువి సంస్థ నుంచి భారీ సినిమా ప్రకటన వచ్చి చాలా కాలం అయింది. సాహో.. రాధేశ్యామ్ సినిమాల తరువాత చేయబోయే భారీ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రేపు రాబోతోంది. మెగాస్టార్ చిరు బర్త్ డే సందర్భంగా ఆయన 157వ సినిమా ప్రకటన వస్తుంది. ఈ సినిమా కాన్సెప్ట్ ను అంతా ఒక పోస్టర్ లో ఒడిసిపట్టి విడుదల చేయబోతున్నారు. ప్రభాస్ తో కాకుండా వేరే హీరోతో భారీ సినిమా చేయబోతోంది యువి సంస్థ.

బింబిసార సినిమాతో దర్శకుడిగా హిట్ కొట్టి, పేరు తెచ్చుకున్న మల్లిడి వేణు (వశిష్ట) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. తొలి సినిమా మాదిరిగానే రెండో సినిమా కూడా సోషియో ఫాంటసీ. అదే విధంగా తొలి సినిమాలో వున్నట్లే మలి సినిమాలో కూడా పాప సెంటిమెంట్ వుంటుందని తెలుస్తోంది. తొలి సినిమాకు పని చేసిన సంగీత దర్శకుడు మణిశర్మ, సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు ఈ సినిమాకు కూడా పని చేస్తారు. మెగాస్టార్‌తో చోటా పనిచేసి కాస్త గ్యాప్ వచ్చింది.

భోళాశంకర్ సినిమా తరువాత మెగాస్టార్ తన కుమార్తె నిర్మాతగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి వుంది. దాని స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. దానికి మరో యంగ్ హీరో కూడా కావాలి. ఇద్దరు హీరోయిన్లు కావాలి. ఇవన్నీ సెట్ కావడానికి కొంచెం టైమ్ పట్టేలాగే వుంది. అయినా ఆ సినిమా తరువాతే యువి సినిమా వుంటుందని తెలుస్తోంది.

వాస్తవానికి యువి సంస్థ రామ్ చరణ్ తో సినిమా తీయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. కానీ దాని కన్నా ముందు మెగాస్టార్ తో సినిమా సెట్ అయింది.