ఒక్క సినిమా హిట్ అయితేచాలు, హీరోయిన్ల రేట్లు తారాజువ్వల్లా ఎగిరిగిపోతాయి. ఇప్పటిదాకా ఫ్లాపులు ఇచ్చిన హీరోయిన్లు నభానటేష్, నిధి అగర్వాల్ లు కూడా తమ పారితోషికాలు అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ కావడమే అందుకు కారణం. నభా, నిధి ఇద్దరూ కొత్త ఆఫర్ వస్తేచాలు ఎనభై లక్షలు కోట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
అయితే వాళ్లు కోట్ చేసినంత మాత్రాన నిర్మాతలు ఇవ్వరు. బేరాలు, సారాలు మామూలే. నిధి లేటెస్ట్ గా ఓ సినిమాను తక్కువకే అంగీకరించినట్లు తెలుస్తోంది. యాభైలక్షల లోపు పారితోషికానికి ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నభా కూడా చెప్పడం 80 వరకు చెబుతున్నట్లు, యాభై రేంజ్ లో ఒప్పుకుంటున్నట్లు వినిపిస్తోంది.
అయితే హీరోలు, డైరక్టర్ల రెమ్యూనిరేషన్ తో పోల్చుకుంటే, అలాగే బాలీవుడ్ హీరోయిన్ల రేంజ్ తో పోల్చుకుంటే, పాపం మన హీరోయిన్ల పారితోషికాలు కారు చౌక అనే చెప్పుకోవాలి.