వినడానికి, చదవడానికి కాస్త ఆసక్తికరంగా వుండే కాంబినేషన్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మెగాఫోన్ పట్టుకోవడం మానేసారు. సూపర్ వైజింగ్ మాత్రమే చేస్తున్నారు ఇప్పుడు. ఆయన ఆ మధ్య ఓ ప్రాజెక్టు తలపెట్టారు. ఒకే కథ, ఒకే సినిమా కానీ, ముగ్గురు దర్శకులు పనిచేస్తారు. హీరో, ముగ్గురు హీరోయిన్లు వుంటారు. ఆ ముగ్గురు డైరక్టర్లుగా క్రిష్, కెఎస్ ప్రకాష్ ఫిక్స్ అయ్యారు. మూడో డైరక్టర్ ఎవరో తెలియాల్సి వుంది. అలాగే నాగశౌర్యను హీరోగా ఫిక్స్ చేసుకున్నారు.
కానీ ఇలాంటి టైమ్ లో ఓ కీలకమైన మార్పు జరిగిపోయింది. ఈ ప్రాజెక్టులోకి నిర్మాత దిల్ రాజు వచ్చిచేరారు. దాంతో మొత్తం ఈక్వేషన్లు మారిపోయాయి. ఆర్కామీడియా, రాఘవేంద్రరావు ఫిఫ్టీ పర్సంట్, దిల్ రాజు ఫిఫ్టీ పర్సంట్ గా ప్రాజెక్టు ఫిక్స్ అయింది. నిర్మాణం అంతా దిల్ రాజునే చూసుకుంటారు.
ఇంకో కీలకమైన మార్పు ఏమిటంటే, ముగ్గురు డైరక్టర్లు అన్న కాన్సెప్ట్ వదిలేసారు. ఒకరే డైరెక్ట్ చేస్తారు. ఆ ఒక్కరు ఎవరు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. నాగశౌర్యనే హీరో. హీరోయిన్ల ఎంపిక జరగాల్సి వుంది.