ఆ సినిమా కోసం కొట్టేసుకుంటున్నారు?

బాలీవుడ్ సినిమా అంథాదూన్ కొన్నాళ్ల క్రితం వరకు ఎవరికీ అక్కరలేకపోయింది. కానీ రాక్షసుడు, ఎవరు, ఇలా థ్రిల్లర్లు జనాలకు ఎక్కేస్తుంటే, అంథాదూన్ మీద మోజు పెరిగిపోయింది. ఎవరెవరు పోటీ పడుతున్నారు? అన్నీ ముందగానే వెల్లడించేసాం.…

బాలీవుడ్ సినిమా అంథాదూన్ కొన్నాళ్ల క్రితం వరకు ఎవరికీ అక్కరలేకపోయింది. కానీ రాక్షసుడు, ఎవరు, ఇలా థ్రిల్లర్లు జనాలకు ఎక్కేస్తుంటే, అంథాదూన్ మీద మోజు పెరిగిపోయింది. ఎవరెవరు పోటీ పడుతున్నారు? అన్నీ ముందగానే వెల్లడించేసాం. అయితే పోటీలో చివరకు హీరో నితిన్ ఫాదర్ సుధాకర రెడ్డి, నైజాం ఏస్ బయ్యర్ సునీల్ నారంగ్ మిగిలారు.

ఈ విషయంలో వయా కామ్ వాళ్ల డిమాండ్ లు అన్నింటికీ, అంటే మూడుకోట్ల రేటు, ప్రొడక్షన్ లో 40 పర్సంట్ షేర్ అన్నింటికీ సునీల్ ఒకే అనేసారు. ఇక అగ్రిమెంట్ అయిపోతుంది అనే టైమ్ లో మళ్లీ మళ్లీ బ్రేక్ లు పడుతున్నట్లు బోగట్టా. సుధాకర్ రెడ్డి, టాగోర్ మధు కలిసి ఆ సినిమా ఎలాగైనా తామే తీసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో నితిన్ – వెంకీ కుడుమల  సినిమా డేట్ వచ్చింది. క్రిస్మస్ కి విడుదల అంటూ, దాంతో ఆ వెంటనే రవితేజ డిస్కోరాజా డేట్ వచ్చింది. డిసెంబర్ 20 అంటూ. ఇలా రావడం వెనుక ఈ అంథాదూన్ పోటీ ప్రభావం వుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే డిస్కోరాజా డిస్ట్రిబ్యూటర్ సునీల్ నే కావడం, ఆయనే ఈ డేట్ కు కావాలని ఫిక్స్ చేసారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అది నిజమో కాదో అన్న సంగతి పక్కన పెడితే, ఓ హింధీ థ్రిల్లర్ కోసం మనవాళ్లు ఇంతలా వెంపర్లాడిపోతున్నారు. విదేశీ సినిమాలను డబ్బులు ఇచ్చి మరీ కొని తెస్తున్నారు అంటే, కథలకు ఎంత కరువొచ్చి పడిందో అన్నది మాత్రం అర్థం అవుతోంది.

జనం విజ్ఞతను తక్కువగా చూస్తే పవన్‌కే నష్టం