వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వైఖరికి ప్రముఖ సినీ రచయిత హర్ట్ అయ్యారు. ఈ విషయాన్ని సదరు రచయితే స్వయంగా ప్రకటించారు. మనసు గాయపడిన ఆ రచయితే రామజోగయ్య శాస్త్రి. వర్మ ప్రతిభను ప్రశంసిస్తూనే, మరోవైపు సుతిమెత్తగా చీవాట్లు పెట్టారు.
టాలీవుడ్లో అత్యంత వివాదాస్పద, సంచలన దర్శకుడిగా రామ్‌గోపాల్ వర్మ పేరు పొందాడు. నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉండడం ఆయన ప్రత్యేకత. రామ్‌గోపాల్‌వర్మ తాజా సంచలనం ‘పవర్ స్టార్’ పేరుతో సినిమా చేయబోతున్న సినిమా. ఈ సినిమా ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. ఎందుకంటే పవర్ స్టార్ అంటే పవన్‌కల్యాణే గుర్తుకొస్తారు. వర్మ, పవన్ మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలున్నాయో అందరికీ తెలుసు.
ఈ సినిమా ప్రకటన నేపథ్యంలో ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా వేదికగా వినూత్నంగా స్పందించారు. ఆ స్పందనలో సృజనాత్మకత, వ్యంగ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.
‘నేను కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్పి చూసి మా తెలుగు వాళ్లకు ఓ మణిరత్నం ఉన్నాడనుకున్నాం. కానీ మీరేమో నా ఇష్టం అంటూ ఏమేమో చేస్తున్నారు. పొండి సార్ మీతో కటిఫ్.. మీరేమి రిప్లై ఇవ్వక్కర్లేదు. తెలివిగా ఏదో చెప్పేస్తారు. నేను హర్ట్’ అని ట్వీట్ చేశారు.