సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై దిమ్మ‌తిరిగే నివేదిక‌!

క‌ర‌వు పీడిత ప్రాంత‌మైన రాయ‌ల‌సీమ‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సాగునీళ్లు అందించ‌కూడ‌ద‌ని కొంద‌రు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం లేదు. తాజాగా కేంద్ర అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ ఇచ్చిన నివేదిక చూస్తే….కొంద‌రికి మైండ్ బ్లాక్ కాక త‌ప్ప‌దు. రాయ‌లసీమ…

క‌ర‌వు పీడిత ప్రాంత‌మైన రాయ‌ల‌సీమ‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సాగునీళ్లు అందించ‌కూడ‌ద‌ని కొంద‌రు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం లేదు. తాజాగా కేంద్ర అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ ఇచ్చిన నివేదిక చూస్తే….కొంద‌రికి మైండ్ బ్లాక్ కాక త‌ప్ప‌దు. రాయ‌లసీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని పూర్తి చేసి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప్ర‌తి ఎక‌రాకు సాగునీళ్లు అందించాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న భ‌గీర‌థ ప్ర‌య‌త్నాల‌కు కేంద్ర అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ తాజాగా ఇచ్చిన నివేదిక కొండంత అండ అని సాగునీటి నిపుణులు చెబుతున్నారు.

అనుమ‌తి లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును చేప‌ట్టారంటూ తెలంగాణ నివాసి అభ్యంత‌రాల మేర‌కు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చెన్నై బెంచి విచార‌ణ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో కేంద్రప్రభుత్వాన్ని ప్ర‌తివాదిగా చేర్చారు. 

తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ కేసులో జత చేరింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయో లేదో గమనించి నివేదిక ఇవ్వాలని గతంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డును గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశించింది. బోర్డు ఏర్పాటుచేసిన కమిటీ సీమ ఎత్తిపోతలను సందర్శించి డీపీఆర్‌ తయారీకి అవసరమైన పనుల కన్నా మించి అక్కడ నిర్మాణ పనులు సాగుతున్నాయని నివేదిక ఇచ్చింది.

దీనిపై ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో  కేంద్ర అటవీ, పర్యావరణశాఖలు నివేదిక ఇవ్వాల‌ని ఎన్జీటీ ఆదేశించింది. దీంతో కేంద్ర అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ‌శాస్త్ర‌వేత్త ప‌సుపులేటి సురేష్‌బాబు ఈ నెల‌ 6న రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని సందర్శించారు. 

రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు జరగడం లేదని ఆయ‌న నివేదిక ఇచ్చారు. అంతేకాదు, ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్న లక్షణాలు ఏవీ అక్కడ క‌నిపించ‌లేద‌ని తేల్చి చెప్పారు. పనుల్లో ఎలాంటి పురోగతి లేదని స్ప‌ష్టం చేశారు. కానీ  మెటీరియల్ మాత్రం ఉన్న‌ట్టు గుర్తించామ‌న్నారు.  

కేంద్ర అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త నివేదిక‌తో ఇంత‌కాలం రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం సాగుతున్న దుష్ప్ర‌చారానికి స‌మాధానం ఇచ్చిన‌ట్టుగా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.