జబర్దస్త్ షాక్.. హైపర్ ఆదికే తక్కువ జీతం

జబర్దస్త్ లో నటిస్తున్న కమెడియన్లంతా ఇళ్లు కట్టుకున్నారనే టాక్ ఉంది. అందులో కాస్త వాస్తవం కూడా ఉంది. జబర్దస్త్ తో లక్షలు సంపాదించిన వాళ్లు ఉన్నారు. తాజాగా ఈ షోలో నటిస్తున్న కమెడియన్ల పారితోషికాలు…

జబర్దస్త్ లో నటిస్తున్న కమెడియన్లంతా ఇళ్లు కట్టుకున్నారనే టాక్ ఉంది. అందులో కాస్త వాస్తవం కూడా ఉంది. జబర్దస్త్ తో లక్షలు సంపాదించిన వాళ్లు ఉన్నారు. తాజాగా ఈ షోలో నటిస్తున్న కమెడియన్ల పారితోషికాలు బయటకు వచ్చాయి. వీటితో పాటు నాగబాబు, రోజాల రెమ్యూనరేషన్స్ కూడా లీక్ అయ్యాయి. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జబర్దస్త్ కు ఓ క్రేజ్, యూట్యూబ్ లో విపరీతమైన డిమాండ్ తీసుకొచ్చిన హైపర్ ఆదికి, మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే కాస్త తక్కువ రెమ్యూనరేషన్ ఉంది.

అవును.. హైపర్ ఆది కంటే చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్ ఎక్కువ తీసుకుంటున్నారు. వీళ్లు నెలకు 4 లక్షల రూపాయల వరకు జీతం అందుకుంటున్నారు. అటు హైపర్ ఆదికి మాత్రం 3 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఒక స్కిట్ కు ఇంత మొత్తం అనే రేంజ్ లో గతంలో వీళ్ల పారితోషికాలు ఉండేవి. అయితే అవన్నీ తీసేసి ఇప్పుడు నెలజీతం ఫిక్స్ చేశారు. మొత్తంగా చూసుకుంటే జబర్దస్త్ టీమ్ లో అతి తక్కువ జీతం 75వేల రూపాయలుగా ఉంది. కాస్త పేరున్న ఆర్టిస్టులంతా అటుఇటుగా రెండున్నర లక్షల జీతం తీసుకుంటున్నారు.

అటు యాంకర్లకు కూడా ఈ షో ద్వారా కాస్త ఎక్కువే పారితోషికం దక్కుతోంది. అనసూయకు నెలకు 4 లక్షలు, రష్మికి 3 లక్షల రూపాయల మొత్తం దక్కుతోందట. ఇక జబర్దస్త్ లో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వ్యక్తి నాగబాబు. ఈయనకు కాస్త అటుఇటుగా నెలకు 20 లక్షల రూపాయలు గిట్టుబాటు అవుతున్నట్టు తెలుస్తోంది. రోజాకు 15 లక్షల రూపాయల వరకు ఇస్తున్నారట. 

జనం విజ్ఞతను తక్కువగా చూస్తే పవన్‌కే నష్టం