మెగా హీరోల‌ గురించి అకీరాకు రేణూ ఏం చెప్పిందంటే…

పవ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మ‌న‌సులోని భావాల‌ను వెల్ల‌డించ‌డానికి ఏ మాత్రం సంశ‌యించ‌రు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు ఆమె సామాజిక‌, రాజ‌కీయ‌, చిత్ర ప‌రిశ్ర‌మ విష‌యాల‌పై త‌న అభిప్రాయాల‌ను కుంబ‌బ‌ద్ద‌లు…

పవ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మ‌న‌సులోని భావాల‌ను వెల్ల‌డించ‌డానికి ఏ మాత్రం సంశ‌యించ‌రు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు ఆమె సామాజిక‌, రాజ‌కీయ‌, చిత్ర ప‌రిశ్ర‌మ విష‌యాల‌పై త‌న అభిప్రాయాల‌ను కుంబ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్ప‌డం చూశాం.

త‌న వివాహ బంధం విచ్ఛిన్నం కావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను కూడా ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా సున్నితంగానే వెల్ల‌డించారు. అప్ప‌ట్లో ఆ వీడియో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. త‌న‌కు గ్రామీణ వాతావ‌ర‌ణంలో గ‌డ‌ప‌డం ఎంతో ఇష్ట‌మ‌ని కూడా ఆమె చెప్పారు.

తాజాగా త‌న కుమారుడు అకీరా గురించి ప్ర‌స్తావించారు. అకీరా సినిమాల్లోకి ఎంట్రీ అవుతార‌నే ప్ర‌చారం  నేప‌థ్యంలో ఆమె స్పంద‌న ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇప్పుడు అకీరా వ‌య‌సు 16 ఏళ్లు మాత్ర‌మే అన్నారు. అకీరాకు ఎంతో భ‌విష్య‌త్ ఉంద‌న్నారు. అన్నిటికి మించి మంచి మ‌నిషిగా బ‌త‌క‌డం ముఖ్య‌మ‌నే సందేశాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అకీరాకు చెబుతూ ఉంటాన‌న్నారు. అయితే అకీరా ఏ వృత్తిని ఎంచుకున్నా త‌ల్లిగా పూర్తి స్థాయిలో త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు.

ప్ర‌ధానంగా నాన్న (ప‌వ‌న్‌క‌ల్యాణ్‌), పెద‌నాన్న (చిరంజీవి), అన్న (రాంచ‌ర‌ణ్‌) హీరోల‌నే ఆలోచ‌న‌తో తాను కూడా అలా కావాల‌నే ఒత్తిడిని చేజేతులా తీసుకోవ‌ద్ద‌ని, మ‌న‌సుపై అన‌వ‌స‌ర భారాన్ని వేయ‌వద్ద‌ని అకీరాకు సూచించిన‌ట్టు రేణూ తెలిపారు. 

మ‌న‌సుకు ఇష్ట‌మైన‌ది మాత్ర‌మే చేయాల‌ని, ఎప్పుడూ త‌న‌ స‌పోర్ట్ ఉంటుంద‌ని అకీరాకి చాలా సార్లు చెప్పిన‌ట్టు రేణూ స్పష్టం చేశారు. దీంతో అకీరా ఇప్ప‌ట్లో సినిమా ఇండ‌స్ట్రీలో ఎంట్రీ అవుతార‌నే ప్ర‌చారానికి తెర‌ప‌డిన‌ట్టే. 

జగన్ గారిని ఫాలో అవ్వక తప్పదు

'పీవీ'ని ఆకాశానికి ఎత్తేసిన కెసిఆర్