cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాయ్ ఫ్రెండ్‌కు రొమాన్స్ న‌చ్చ‌లేదంటున్న బుల్లితెర తార

బాయ్ ఫ్రెండ్‌కు రొమాన్స్  న‌చ్చ‌లేదంటున్న బుల్లితెర తార

మూడేళ్లుగా తాను ప్రేమాయ‌ణం సాగిస్తున్న‌ట్టు బాలీవుడ్ బుల్లితెర తార ఎరికా ఫెర్నాండెజ్ తెలిపారు. అయితే  కెరీర్‌లో భాగంగా ఇత‌రుల‌తో రొమాన్స్ చేయ‌డం త‌న బాయ్ ఫ్రెండ్‌కు న‌చ్చ లేద‌ని ఈ బుల్లితెర భామ చెప్పుకొచ్చారు. చూడ చ‌క్క‌ని రూపం, మాట‌కారి అయిన బుల్లితెర బ్యూటీ త‌న ప్రేమ సంగ‌తుల గురించి వివ‌రాలు వెల్ల‌డించారు.

అయితే తాజాగా త‌న ప్రేమ ర‌హ‌స్యాన్ని బ‌య‌ట పెట్ట‌డానికి కార‌ణాన్ని కూడా ఆమె వెల్ల‌డించారు. ఇటీవ‌ల స‌హ న‌టుల‌తో తన‌కు ఎఫైర్స్ ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో...నిజం చెప్పాల‌ని ముందుకొచ్చాన‌న్నారు. తాను ఇష్ట‌ప‌డే వాడు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన వాడు కాద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ఇన్‌స్టా లైవ్‌లో ఆమె మాట్లాడుతూ అనేక విష‌యాలు చెప్పుకొచ్చారు.

'కసౌతి జిందగీ కే 2’ సీరియ‌ల్‌లో ప్రేర్నా‌గా నటించిన టీవీ స్టార్ ఎరికా ఫెర్నాండెజ్ బాగా పాపుల‌ర్ అయ్యారు. త‌న‌ సహనటుడు పార్థ్‌ సమతాన్‌తోనూ, ‘కుచ్‌ రంగ్‌ ప్యార్‌ కే ఐసే భీ’ సహనటుడు షాకీర్‌ షేక్‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్టు వేర్వేరు సంద‌ర్భాల్లో విస్తృత ప్ర‌చారం జరిగింది.  అయితే పార్థ్, షాకీర్ ఇద్ద‌రూ స్నేహితులు మాత్ర‌మేన‌ని ఎరికా ఆ ప్ర‌చారానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

తాను మూడేళ్లుగా ఒకరితో ప్రేమలో మునిగి తేలుతున్న‌ట్టు తెలిపారు. అయితే తాను ఇష్ట‌ప‌డే ఆ వ్య‌క్తి సినీ పరిశ్రమకు చెందిన వాడు కాద‌ని, అందువ‌ల్ల ఎవరికీ తెలుసుకునే అవ‌కాశం లేద‌న్నారు.

"నా బాయ్‌ఫ్రెండ్ నా షోలు చూస్తుంటాడు. అత‌నికి నేను వేరే వాళ్ల‌తో రొమాన్స్ చేయ‌డం న‌చ్చ‌దు. కానీ మా మ‌ధ్య ఉన్న స్నేహం, అవ‌గాహ‌న వ‌ల్ల ఇంకా రిలేష‌న్‌లో కొన‌సాగుతున్నాం " అని ఎరికా తెలిపారు.   

'పీవీ'ని ఆకాశానికి ఎత్తేసిన కెసిఆర్

ఐదుసార్లు ట్రైచేసి నావల్లకాక వదిలేసాను