తప్పు కాదు పవన్.. అది కుసంస్కారం!

ఆవేశంలో మాట తూలడం, అదుపు తప్పిపోవడం అందరూ చేస్తారు.. కానీ బుద్ధీ జ్ఞానం ఉన్నవాళ్లు దానిని మళ్లీ చక్కదిద్దుకుంటారు. పశ్చాత్తపపడతారు. అలా చక్కదిద్దుకోవడానికి కొంత ఈగో అడ్డువచ్చినా సరే.. కనీసం మళ్లీ అదేతప్పును చేయకుండా…

ఆవేశంలో మాట తూలడం, అదుపు తప్పిపోవడం అందరూ చేస్తారు.. కానీ బుద్ధీ జ్ఞానం ఉన్నవాళ్లు దానిని మళ్లీ చక్కదిద్దుకుంటారు. పశ్చాత్తపపడతారు. అలా చక్కదిద్దుకోవడానికి కొంత ఈగో అడ్డువచ్చినా సరే.. కనీసం మళ్లీ అదేతప్పును చేయకుండా జాగ్రత్త పడతారు. 

కానీ.. ఆవేశం తన హద్దులను మరచిపోయేలా చేసినప్పుడు.. ఒక తప్పు చేస్తే.. దానిని సమర్థించుకోవడాని చెత్త వాదనలను తయారు చేసుకుని ఊరేగే మనుషుల్ని ఎలా వర్గీకరించాలి? ఎలా అర్థం చేసుకోవాలి? నిజానికి అలాంటి వర్గం అనడానికి ఎక్కువమంది కూడా ఉండరు.. పవన్ కల్యాణ్ మాత్రమే ఉంటాడు. 

ముఖ్యమంత్రిని ఉద్దేశించి విలేకర్ల సమావేశంలో చెప్పు చూపించి హెచ్చరికలు చేయడం ద్వారా పవన్ కల్యాణ్ అదుపు తప్పి ప్రవర్తించాడు. తన అతివాద, ఎగస్ట్రా వేషాలను ప్రదర్శించాడు. అది ఆదిగా.. అటునుంచి అంతకంటె ఘోరంగా ప్రవర్తించగల, మాట్లాడగల వైసీపీ నాయకులు పవన్ ను ఆడిపోసుకోవడమూ.. పవన్ తరఫున ఆయన తైనాతీలు ప్రతివిమర్శలు చేయడమూ ఇదంతా కొంత కాలం పాటు నడిచింది. 

ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన సహజశైలిలో తానుగా ఏమీ స్పందించకుండానే ఉండిపోయారు. ఏదో నోరు జారి పవన్ అన్నాడు.. దానికి జవాబుగా మరికొందరు మరికొన్ని మాటలు అని ఉంటారు.. కాలం మించిన మందు లేదు కాబట్టి.. అంతా సద్దుమణిగిపోతున్నది అని ప్రజలు అనుకుంటున్న తరుణంలో.. పవన్ మళ్లీ తన చెప్పును తానే బయటకు తీస్తున్నారు. 

విజవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించిన పవన్ కల్యాణ్.. ప్రజల కడుపు మండిపోతోంది చెప్పు చూపిస్తే తప్పా అంటూ మళ్లీ తిరగతోడుతున్నారు. ప్రజలు అనుకుంటున్నది మాత్రం ఒక్కటే.. చెప్పు చూపించడం తప్పు అవునో కాదో గానీ.. పవన్ కల్యాణ్.. నీ వైఖరి మాత్రం ఖచ్చితంగా కుసంస్కారం. నీకు ఆవేశం ఉంది గానీ సంస్కారం లేదు.. అనుకుంటున్నారు. 

చంద్రబాబునాయుడు కుటుంబం గురించి వల్లభనేని వంశీ కూడా నోరు జారాడు. చాలా పెద్ద వివాదమే అయింది. నిజానికి అయిన వివాదంకంటె అతిగా దాన్ని ప్రచారంలోకి తెచ్చి.. తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చంద్రబాబునాయుడు విలపిస్తూ తన ప్రయత్నాలు తాను చేశారు కూడా! కొన్ని రోజుల తర్వాత వంశీ తాను అలా మాట్లాడడం తప్పే అంటూ క్షమాపణ కోరడం జరిగింది. వంశీ ఇతరత్రా లక్షణాలేమిటి అనేది ఇక్కడ చర్చనీయాంశం కాదు. కానీ.. తప్పు జరిగినప్పుడు.. కనీసం సారీ చెప్పే సంస్కారం అతనికి ఉంది. 

ముఖ్యమంత్రికి చెప్పు చూపించి ఒక తప్పు చేసినప్పుడు.. సారీ చెప్పేంత సంస్కారం పవన్ కల్యాణ్ కు లేకపోవచ్చు. మళ్లీ దానిని సమర్థించుకోవడానికి, కొత్త వాదనను సృష్టించుకుని మాట్లాడడం చిత్రం. ఇదంతా చూస్తోంటే.. ఆయన జీవితంలోని ఏకైక హిట్ సినిమా ఖుషిలో డైలాగ్ గుర్తుకొస్తోంది. 

భూమిక గురించి పవన్ కల్యాణ్, ఆమె తండ్రిగా చేసిన విజయకుమార్ మాట్లాడుకుంటారు. ఆమె ఈగో గురించి మాట్లాడుకుంటారు. ఆ డైలాగు ఎవరికైనా గుర్తుకు వస్తే మనం చేయగలిగిందేం లేదు.