సచివాలయం….మంత్రుల క్వార్టర్స్ అన్నీ అక్కడే…

ఏపీలో మూడు రాజధానుల కధ ఒక లాజికల్ కంక్లూషన్ కి చేరుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీని మీద సుప్రీం కోర్టు లో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్…

ఏపీలో మూడు రాజధానుల కధ ఒక లాజికల్ కంక్లూషన్ కి చేరుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీని మీద సుప్రీం కోర్టు లో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ మీద విచారణ జరిగి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే క్షణమైనా ఆలస్యం చేయకుండా విశాఖ రాజధాని అవుతుంది.

ఒక వేళ తీర్పు ఏమైనా ప్రతికూలంగా వచ్చినా అమరావతి పేరుకు రాజధానిగా ఉంటుంది కానీ విశాఖ అసలైన రాజధాని అవుతుంది. అంటే రాజధాని అని దానికి ప్రత్యేకంగా పేరు పెట్టరు, అలా ఎక్కడా కూడా అఫీషియల్ గా  పిలవరు. కానీ జరిగేదంతా అలాగే ఉంటుంది. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అన్నది అనాదిగా జరుగుతున్న విషయం.

ముఖ్యమంత్రి జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతారు. ఆయనతో పాటే సచివాలయం, అలాగే మంత్రులు అంతా కూడా విశాఖకే షిఫ్ట్ అవుతారు. అసెంబ్లీ మాత్రం అమరావతిలో ఉంటుంది. న్యాయ రాజధానికి కేంద్రంలోని బీజేపీ కూడా సుముఖంగా ఉంది. అయితే దాని పేరు కూడా రాజధాని అని పిలవకుండా హై కోర్టు అక్కడకు షిఫ్ట్ చేస్తారు.

అంటే మూడు రాజధానులు అని ప్రత్యేకంగా చట్టం చేయకుండా రాజ్యాంగ పరిధిలు పరిమితులకు లోబడి కూడా వికేంద్రీకరణ చేయవచ్చు. ఆ దిశగానే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఆలోచనలు సాగుతున్నాయి. దీని మీద ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉంది. సాధ్యమనంత త్వరలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. 

ఇప్పటికే ముఖ్యమంత్రి ఆఫీస్ విశాఖలో రెడీ అవుతోంది. అందువల్ల మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి ఒక తార్కికమైన ముగింపు తొందరలోనే ఏపీ అంతా చూడబోతోంది అన్నది నిజం అంటున్నారు.