సూపర్ స్టార్ మహేష్ బాబు-మాస్ డైరక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో అనిల్ సుంకర-దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరూ. ఈ సినిమాకు బయ్యర్లను ఇటీవలే ఫిక్స్ చేసారు.
దిల్ రాజు రెగ్యులర్ బయ్యర్లనే దాదాపు ఫిక్స్ చేసారు. అయితే రేట్ల డిస్కషన్ తరువాత స్టార్ట్ అయింది. అక్కడే వచ్చింది తకరారు.
ఆంధ్ర వరకు ఫరవాలేదు వ్యవహారం. ఎందుకంటే మహర్షి సినిమా ఆంధ్రలో, నైజాంలో సమస్య కాలేదు. కానీ సీడెడ్ లో మాత్రం బయ్యర్ కొన్న మొత్తానికి రీచ్ కాలేదు.
సీడెడ్ లో 12 కోట్ల మేరకు బయ్యర్ శోభన్ కొనుగోలు చేస్తే, దగ్గర దగ్గర రెండు కోట్ల మేరకు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాను కూడా మళ్లీ అదే 12 కోట్లు రేట్ చెప్పారు.
దీంతో బయ్యర్ శోభన్ నో చెప్పినట్లు తెలుస్తోంది. సమ్మర్ లాంటి కీలకమైన టైమ్ లో, అది కూడా సోలో విడుదల గా వచ్చి, బ్లాక్ బస్టర్ అనిపించుకుని కూడా సీడెడ్ లో 11 కోట్ల మేరకు వసూలు చేసింది కనుక 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాకు కూడా 12 కోట్లు రేటు అంటే కష్టమని బయ్యర్ శోభన్ స్పష్టం చేసినట్లు ట్రేడ్ వర్గాల బోగట్టా.
పైగా ఇప్పుడు త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ సినిమా, రజనీకాంత్ సినిమా, ఇలా చాలా పోటీ వుంది. ఈ నేపథ్యంలో 12 కోట్లు అంటే కష్టమని, పది కోట్లు అయితే ఓకె అని బయ్యర్ శోభన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కావాలంటే వేరే వాళ్లకు ఇచ్చేయమని కూడా అన్నట్లు బోగట్టా.
మరి దిల్ రాజు-అనిల్ సుంకర, రేటు తగ్గించి శోభన్ కే ఇస్తారో? వేరే బయ్యర్ ను చూస్తారో చూడాలి.