ముద్దుగుమ్మ‌కు భ‌ర్త కావాలి…ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి!

అందాల ఆర‌బోత అమ్మాయికి ఆధ్మాత్మిక మొగుడు కావాల‌ని కోరుకుంటోంది. సాటి హీరోయిన్లంతా పెళ్లిళ్లు చేసుకుంటూ, తిరిగి కెరీర్ కొన‌సాగిస్తుండ‌డంతో బ్యూటీ రాశీఖ‌న్నాకు కూడా పెళ్లిపై గాలి మ‌ళ్లిన‌ట్టుంది. దీంతో త‌న‌కు కాబోయే వ‌రుడికి ఎలాంటి…

అందాల ఆర‌బోత అమ్మాయికి ఆధ్మాత్మిక మొగుడు కావాల‌ని కోరుకుంటోంది. సాటి హీరోయిన్లంతా పెళ్లిళ్లు చేసుకుంటూ, తిరిగి కెరీర్ కొన‌సాగిస్తుండ‌డంతో బ్యూటీ రాశీఖ‌న్నాకు కూడా పెళ్లిపై గాలి మ‌ళ్లిన‌ట్టుంది. దీంతో త‌న‌కు కాబోయే వ‌రుడికి ఎలాంటి అర్హ‌త‌లుండాలో రాశీఖ‌న్నా చెప్పుకొచ్చారు.

గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు మారుపేరుగా నిలుస్తున్న‌ రాశీఖ‌న్నా …త‌న జీవిత భాగ‌స్వామి విష‌యంలో మాత్రం అందుకు భిన్న‌మైన అభిప్రాయాన్ని వెల్ల‌డించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.  ప్ర‌స్తుతం తొమ్మిది సినిమాల‌తో ఎంతో బిజీగా వున్న రాశీఖ‌న్నా పెళ్లి ముచ్చ‌ట్లు చెప్పారు. 

అమ్మ‌డు పెళ్లి ఊసులు చెబుతుంటే వినే వాళ్ల‌కు కొద‌వా? ఇంత‌కూ ఆ అంద‌గ‌త్తె మ‌న‌సులో త‌న‌కు కాబోయే వాడి గురించి ఏం ఊహించుకుంటున్న‌దంటే…తనకు కాబోయే భర్త పెద్ద అందగాడు కాకపోయినా ఫ‌ర్వాలేద‌ట‌. కానీ ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడై ఉండాలని ఆమె ష‌ర‌తు విధించారు. 

తన లాగే దేవుడిపై నమ్మకంతో పాటు భక్తిభావం ఉన్న వ్యక్తి  భర్తగా రావాలని  అందాల రాశి…రాశీ ఖన్నా కోరుకోవ‌డం గ‌మ‌నార్హం. అలాంటి మ‌గాన్ని వెతికి మొగున్ని చేసుకుంటాన‌ని ముద్దుగుమ్మ మురిపెంగా చెబుతోంది.