పనిలేని లోకేష్.. కొత్త పేర్లు కనిపెడుతున్నారు

యుశ్రారైకాపా. ఇదేంటి అనుకుంటున్నారా.. మన నారా లోకేషం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని హేళన చేసిన విధానం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ని.. ఇలా కుదించి రాశారన్నమాట. అరెరె.. ఈనాడు వారికి కూడా…

యుశ్రారైకాపా. ఇదేంటి అనుకుంటున్నారా.. మన నారా లోకేషం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని హేళన చేసిన విధానం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ని.. ఇలా కుదించి రాశారన్నమాట. అరెరె.. ఈనాడు వారికి కూడా ఇలాంటి ఆలోచన తట్టలేదే. తెలుగుదేశం పార్టీని తెదేపా అనే ఆ పత్రిక.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని మాత్రం ఇన్నాళ్లూ వైకాపా అంటూ వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే.. మహానేత పేరు గుర్తు చేసినట్టవుతుంది కాబట్టి.. వైకాపా, వైసీపీ అనే షార్ట్ కట్ లు జనానికి అలవాటు చేసింది ఈనాడు.

ఇక లోకేషం జ్ఞాన గుళికలు చూసిన తర్వాత ఈనాడు కూడా తన ట్రెండ్ మార్చుకోక తప్పదు. అవును.. పనిలేని లోకేష్ ఇంతకంటే ఇంక చేసేదేముంది చెప్పండి. గత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం తర్వాత టీడీపీ ఓటమికి చెప్పుకోడానికి కారణాలు వెదుక్కోవాల్సి వచ్చింది. ఒక్క ఛాన్స్ అంటే ఎలా పాలిస్తారో చూద్దామంటూ జనం జగన్ కి  ఓటేశారట. అదీ వారిచెత్త లాజిక్. ఏడాదిగా అదే భ్రమలో ఉన్నారు, ప్రజల్ని అలాంటి భ్రమలోనే బతికేయమంటున్నారు.

అక్రమార్కుల అరెస్ట్ లు మొదలైన తర్వాత ఇప్పుడు మళ్లీ లబోదిబోమంటున్నారు. ఇలాంటి టైమ్ లో పార్టీ అధిపతి కానీ, కాబోయే అధిపతి కానీ ఏంచేయాలి. పార్టీ శ్రేణులకు అండగా ఉన్నామన్న ధైర్యం కలిగించాలి, మరి లోకేష్ ఏంచేస్తున్నారు. ఓదార్పు ఇవ్వడానికి వెళ్లి.. వంట – వార్పు చూసొస్తున్నారు. 

ఇలాంటి భావి నాయకుడి తోక పట్టుకుని ఎన్నికల ఘట్టాన్ని ఈదడం టీడీపీ తరం కాదు. పోనీ అమాయకుడులే అనుకుంటే.. ఇదిగో ఇలా తన విజ్ఞానాన్ని ట్విట్టర్ లో ప్రవహింపచేస్తున్నారు లోకేష్. ఇకపై వైకాపా కానీ, వైసీపీ కానీ అనకుంటా.. టీడీపీ శ్రేణులంతా యుశ్రారైకాపా అని పిలవాలని హితబోధ చేస్తున్నారు.

చినబాబుకి బొత్తిగా పనిలేదు, అందుకే ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు చిరాకు పడుతున్నారు. పిల్లిని కూడా గదిలో బంధించి కొడితే తిరగబడుతుంది, కానీ లోకేష్.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కుళ్లు జోకులు ఎందుకు వెదుకుతున్నారో అర్థం కావడం లేదు వాళ్లకి.

పార్టీ పేరు మార్చి ఎగతాళి చేసినంత మాత్రాన జగన్ కి తరిగేదేముంది, టీడీపీకి ఒరిగేదేముంది.. పైశాచికానందం తప్ప. పోనీ అలాగే కానీయండి. వచ్చే ఎన్నికల్లో కూడా యుశ్రారైకాపాకే ప్రజలు పట్టం కడతారు చూస్తూ ఉండండి. 

జగన్ గారిని ఫాలో అవ్వక తప్పదు

'పీవీ'ని ఆకాశానికి ఎత్తేసిన కెసిఆర్