అచ్చెన్నాయుడు ఇపుడు ఏసీబీ అరెస్ట్ చేసింది. దాంతోనే తమ్ముళ్లకు దడ పుట్టుకుంది. అది చాలదన్నట్లు ఇది అంతం కాదు అరంభం అంటున్నారు వైసీపీ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్. తప్పు చేస్తే వదిలేస్తామనుకుంటున్నారా తమ్ముళ్ళూ అని టీడీపీని గట్టిగానే ప్రశ్నించారు. బీసీల ముసుగులో తప్పించుకుంటామంటే కుదరదని కూడా పక్కా క్లారిటీగా చెప్పేశారు.
బీసీలను కరివేపాకులా వాడుకున్న చంద్రబాబు ఇపుడు బీసీ జపం చేయడం విడ్డూరమని దాసన్న బాగానే ఏకేశారు. చినబాబు వడ్డీలు, అసలు అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, అపుడే ముఖ్యమంత్రి అయిపోయినట్లుగా ఫీలవుతున్నావా లోకేషూ అంటూ ఎకసెక్కమాడేశారు.
సరే ఆ అసలూ వడ్డీల లెక్కలు బాగానే గుర్తుంచుకో, రేపటి రోజున అవినీతి సొమ్ము వడ్డీలతో కలిపి కక్కిస్తామని కూడా మంత్రి అంటున్నారు. మంగళగిరిలో ఓడిన లోకేష్ ఇక జన్మలో గెలవలేడని కూడా మంత్రి జోస్యం చెప్పేశారు.
అధికారులను ఇష్టం వచ్చినట్లుగా దూషిస్తే అయ్యన్నపాత్రుడిని కానీ మరొకరిని కానీ ఊరకే చూస్తూ అదిలేస్తామా. అది కూడా తప్పేనా చినబాబూ అంటూ మంత్రి గుస్సా అయ్యారు. అక్కడికి వారేదో పరమ పవిత్రులు అయినట్లుగా లోకేష్ పరామర్శలు చేయడమే అతి పెద్ద కామెడీ అంటూ ధర్మాన కడిగిపారేశారుగా. మొత్తానికి ఇది అంతం కాదు ఆరంభం అంటూ క్రిష్ణ దాస్ వదిలిన ఫీలర్ ఇపుడు పచ్చ పార్టీకి ఫీవర్ తెప్పించేదే మరి.