దర్శకుడు పూరి జగన్నాధ్ చాలా లోతైన మనిషి. గురువు రామ్ గోపాల్ వర్మ అదో టైపు. ఆర్జీవీ ది కొందరి మాత్రమే నచ్చే ఫిలాసఫీ. కానీ పూరి జగన్నాధ్ ఫిలాసఫీ అలా కాదు. మనల్ని ప్రభావితం చేస్తుంది. జీవితాన్ని ఎలా చూడాలో నేర్పిస్తుంది. ఎలా ముందుకు సాగాలో దారి చూపుతుంది. అందుకే పూరి చేసిన పాడ్ కాస్ట్ లకు అంత క్రేజ్. ఆర్జీవీ దారిలో పయనించడం కష్టం. అది అంత గొప్ప దారి అని కూడా మనకు అనిపించదు. కానీ పూరి దారిలో వెళ్లాలని అనిపిస్తుంది. ఇలాంటి తత్వం వంట పట్టించుకుంటే వ్యదార్ధజీవితదృశ్యాలు వుండవు కదా అనిపిస్తుంది.
నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే…నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే…ఈ జనం ఎలా స్పందిస్తారో శ్రీశ్రీ ఆనాడే చెప్పాడు. కానీ అలాంటి జన స్పందన సమయంలో శ్రీశ్రీ మనో భావన ఏమిటో మాత్రం చెప్పలేదు.
పూరి జగన్నాధ్ జీవితంలో చూసినన్ని ఎత్తు పల్లాలు, జయాపజయాలు చాల తక్కువ మందికి అనుభవంలోకి వస్తాయి. పడినపుడల్లా లేచాడు. లేచిన తరువాత పడ్డాడు. లేచినా, పడినా ఒకలాగే వున్నాడు పూరి. లైగర్ సినిమాతో మళ్లీ పూరి నేలను ముద్దాడాడు.ఈ నేపథ్యలో ఓసారి పలకరించాలనిపించింది. పలకరించి ఇప్పుడు ఆయన భావనలు తెలుసుకోవాలనిపించింది. ఫోన్ లో పలకరిస్తే…ఫోన్ లో కాదు..డిటైల్డ్ గా రాసి పంపిస్తా అన్నారు. దటీజ్ పూరి. అర్థరాత్రి దాటిన గంట కు పూరి నుంచి జీవిత సందేశం. అదే ఇది. యధాతథంగా.. పాఠకుల కోసం…
మూర్తి గారు..
Success and failure, ఈ రెండూ opposite అనుకుంటాం, కాదు. ఈ రెండూ flow లో ఉంటాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయి. గుండెల నిండా ఊపిరి పిలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి ? ఊపిరి వొదిలెయ్యటమే. పడతాం,లేస్తాం. ఏడుస్తాం, నవ్వుతాం. ఎన్నో రోజులు ఏడ్చినాక next జరిగేది ఏంటి ? పగలబడి నవ్వటమే ..ఇక్కడ ఏదీ permanent కాదు .. లైఫ్ లో మనకి జరిగే ప్రతి సంఘటనని మనం ఒక experience లా చూడాలి తప్ప, failure success లా చూడకూడదు. నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలుజారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, వడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, వూరి వేలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు, ఇలా ఎన్నెన్నో లైఫ్ లో జరుగుతుంటాయి. అవన్నీ సీన్లే. అందుకే లైఫ్ ని సినిమా లా చూస్తే, show అయిపోగానే మర్చిపోవచ్చు. మైండ్ కి తీసుకుంటే మెంటల్ వస్తాది. success ఐతే డబ్బులొస్తాయి.
ఫెయిల్ ఐతే బోలెడు జ్ఞానం వస్తాది. So ఎప్పుడూ మనం mentally, financially gain అవుతూనే ఉంటాం తప్ప, ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదిలేదు. అందుకే దేన్నీ failure గా చూడొద్దు . Bad జరిగితే మన చుట్టూ ఉన్న bad people మాయమైపోతారు .. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది. మంచిదే కదా ? కానీ ఖాళీగా ఉండకూడదు. ఏదోకటి చెయ్యాలి .. అది రిస్క్ అవ్వాలి. Life లో risk చెయ్యకపోతే అది లైఫే కాదు. ఏ risk చెయ్యకపోతే అది ఇంకా risk. Life లో నువ్వు హీరో ఐతే, సినిమాలో హీరోకి ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. పొగుడుతారు, నిందిస్తారు, బొక్కలో వేస్తారు, మళ్ళీ విడుదల చేస్తారు, అందరూ claps కొడతారు, అక్షింతలు వేస్తారు. So ఇవన్నీ మీ life లో జరగకపోతే, జరిగేలా చూడండి. లేకపోతె మీరు హీరో కాదేమో అనుకొనే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరో లా బతకాలి. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి. నేను నిజాయతి పరుడుని అని చెప్పుకొనవసరంలేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది. TRUTH ALWAYS DEFENDS ITSELF.
ఎవరినుంచి ఏదీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పొతే మనలన్ని పీకే వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న audience ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. ACTULLY IM LIABLE TO MY AUDIENCE. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా . వాళ్ళని entertain చేస్తా. ఇక డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడనుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన, ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేనూ దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే .. మధ్యలో జరిగేది అంతా డ్రామా .
సాంతం చదివిన తరువాత పూరి ఫిలాసఫీ మీద గౌరవం పెరిగింది. పూరి లోని రచయిత మీద మరింత అభిమానం కలిగింది. కానీ తనలోని రచయితను..తనలోని సామర్థ్యాన్ని పూర్తిగా వాడకుండా లైగర్ తీసినందుకు కొంచెం కోపం వచ్చింది. మళ్లీ మరోసారి తనేంటో చూపిస్తాడులే అనే ధీమా మాత్రం చెదరలేదు.
-విఎస్ఎన్ మూర్తి