ఊర్వశివో రాక్షసివో అంటూ ఓ తమిళ సినిమా రీమేక్ తో వస్తున్నాడు హీరో అల్లు శిరీష్. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. సినిమా తొలిసగం అంతా రొమాంటిక్ టచ్ తో, మలి సగం అంతా ఎమోషనల్ టచ్ తో సాగే సినిమా ఇది. ఇప్పటికే టీజర్ వగైరాలు వచ్చి, సినిమా లో వున్న స్పైసీ కోణాలను చాటింపు వేసాయి.
సినిమా మొత్తం మీద ఒకటి రెండు కాదు పదహాలు లిప్ లాకులు వున్నాయట. అదీ విషయం. అల్లు శిరీష్ ఏ లెవెల్ లో రెచ్చి పోయి ‘నటించి’ వుంటాడో అర్థం అవుతుంది ఈ లిప్ లాకుల నెంబర్ వింటుంటేనే.
సినిమాలో ఈ లిప్ లాకుల సందడికి తోడుగా హీరో హీరోయిన్ల హగ్గులు, కిందా మీదా పడిపోయే సీన్లు కూడా పుష్కలంగానే వున్నాయట. చూస్తుంటే ‘కిందా మీదా పడైనా’ హిట్ కొట్టాలని అల్లు శిరీష్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
అటు అను ఇమ్మాన్యుయేల్ కు కూడా హిట్ మొహం చూసి చాన్నాళ్లయింది. ఈ సినిమాతో హిట్ కొడితే ఇద్దరకీ బాగుంటుంది. లిప్ లాకుల మాదిరిగానే.