రెండు రోజుల్లో రాజధాని డౌట్స్ క్లియర్

గురువారం 29వ తేదీనాడు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అమరావతిపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అన్ని శాఖల అధికారులు, మంత్రులతో ఈ సమీక్ష సమావేశం ఉంటుంది. కొన్ని రోజలుగా.. రాజధాని అనేది…

గురువారం 29వ తేదీనాడు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అమరావతిపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అన్ని శాఖల అధికారులు, మంత్రులతో ఈ సమీక్ష సమావేశం ఉంటుంది. కొన్ని రోజలుగా.. రాజధాని అనేది అమరావతిలోనే ఉంటుందా? ఉండదా? అనే విషయంలో అనేకానేక సందేహాలు, పుకార్లు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆ సమీక్ష సమావేశం ముగిసే సమయానికి.. అన్ని రకాలుగానూ జగన్ స్పష్టత ఇస్తారని అనుకుంటున్నారు.

కేవలం మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించిన మాటల వల్లనే కొన్ని రోజులుగా రాజధాని ప్రాంతం గురించి అమరావతి గురించి వీరబీభత్సమైన చర్చోపచర్చలు నడుస్తున్నాయి.అన్ని పార్టీలూ ఈ అంశాన్ని తమ తమ మైలేజీకి వాడుకోవాలని కక్కుర్తి పడుతున్నాయి. జగన్ స్వయంగా ప్రకటించేదాకా వేచిచూస్తాం.. ఆ తర్వాత మా కార్యాచరణను ప్రకటిస్తాం అని భాజపా అంటుండగా.. తెదేపా చేస్తున్న గోలకు హద్దే లేకుండా పోతోంది. పవన్ కల్యాణ్ తన సహజశైలిలో ‘నేను మీ వద్దకు వస్తా.. పోరాడుతా’ అనే మాటలు చెప్పి ఊరుకుంటున్నారు.

నిజానికి రాజదాని తరలిపోతుందనే వాదన ప్రభుత్వం తరఫు నుంచి ఎక్కడా వినిపించలేదు. అయితే కోర్ కేపిటల్ కు ఎంపిక చేసిన స్థలంలో నిర్మణాలకు రెట్టింపు కంటె ఎక్కువ ఖర్చవుతుందని మాత్రమే బొత్స చెప్పారు. ఎంత రభస జరిగినా కూడా ఆ మాటకు తాను కట్టబడి ఉన్నానని ఆయన అన్నారు. ఆ మాటను తెదేపా నాయకులు కూడా ఖండించలేరు. నిర్మాణ వ్యయం పెరుగుతుందని చెబుతున్న మాట అబద్ధం అని బొత్సను నిలదీయగలిగిన దమ్ము ఒక్క పార్టీ నాయకుడికి కూడా లేదు.

ఇలాంటి నేపథ్యంలో రాజధాని వ్యవహారంపై అన్ని చర్చలకు రెండురోజుల్లోగా ఫుల్ స్టాప్ పడిపోయే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. గురువారం ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పుడు రాజధాని గా వ్యవహరిస్తున్న ప్రాంతం యొక్క మంచి చెడులను, సంభావ్యతలను ఆయన అధికారులు, నిపుణులను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత కీలక ప్రకటన ఉంటుందని.. అది ఫైనల్ అని ఆశించవచ్చు. ఆ రకంగా రెండు రోజుల వ్యవధిలో అందరి ఆందోళనలకు చరమగీతం పాడేసి.. జగన్ క్లారిటీ ఇస్తారని అనిపిస్తోంది.