ఈ అప్ డేట్ భావమేమి? పవనేశ?

పవన్ కళ్యాణ్ చకచకా సినిమాలు చేస్తున్నారు. అది ఓ పాయింట్ ఈ రోజు వదిలిన మీడియా నోట్ లో. నిజమేగా ఆయన రాజకీయాలను గ్యాప్ ఫిల్లింగ్ గా మార్చి, సినిమాలను మెయిన్ మెనూలోకి తీసుకువచ్చి…

పవన్ కళ్యాణ్ చకచకా సినిమాలు చేస్తున్నారు. అది ఓ పాయింట్ ఈ రోజు వదిలిన మీడియా నోట్ లో. నిజమేగా ఆయన రాజకీయాలను గ్యాప్ ఫిల్లింగ్ గా మార్చి, సినిమాలను మెయిన్ మెనూలోకి తీసుకువచ్చి అప్పుడే ఏడాది దాటిపోతోంది. అయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్ అన్న పద్దతిలో ఎప్పుడో జమానా కాలం నాడు అడ్వాన్స్ లు ఇచ్చిన వారిని అలా అలా వుంచి, ఫ్రెష్ డౌన్ పేమెంట్ దొరికే 'వకీల్ సాబ్' ముందు చేసారు. ఆ తరువాత కూడా ఎఎమ్ రత్నానికో, మైత్రీ కో కాకుండా సితార బ్యానర్ కోసం భీమ్లా నాయక్ ను పట్టుకున్నారు.

దాంతో సగం చేసిన/తీసిన హరిహర వీరమల్లు ప్లాట్ ఫారమ్ మీద అలా వెయిట్ చేస్తోంది. అక్టోబర్ నుంచి ఆ సినిమా సంగతి చూస్తారని టాక్ అయితే వుంది. దాని తరువాత మైత్రీ మూవీస్ సినిమా అని కూడా వార్తలు వున్నాయి. కానీ ఈ లోగా ఈ మధ్య కొత్త గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది.  రామ్ తాళ్లూరి సినిమా ముందుకు వస్తుందని, కాదు, మరో రీమేక్ కోసం చూస్తున్నారని ఇలా రకరకాల వార్తలు. 

ఇలాంటి నేపథ్యంలో మైత్రీ మూవీస్ నుంచి తాజా అప్ డేట్ అనే ప్రెస్ నోట్ వచ్చింది. కానీ ప్రెస్ నోట్ తాజానే కానీ విషయం పాతదే. హరిహర వీరమల్లు తరువాత తమ సినిమా చేస్తారని. హరి హర వీరమల్లు అక్టోబర్ నుంచి వుంటే మరి నెల పడుతుందో, ఇంకెంత పడుతుందో చూడాలి. బహుశా వినిపిస్తున్న రూమర్లకు చెక్ చెప్పడానికే ఈ ప్రెస్ నోట్ పర్పస్ అయి వుండాలి. అదయితే నెరవేరినట్లే ప్రస్తుతానికి.

2022 సంక్రాంతికి భీమ్లానాయక్. 2022 సమ్మర్ కు హరిహర వీరమల్లు. అంటే 2022 దసరాకు మైత్రీ సినిమా విడుదల వుంటుందేమో? ఆ పాయింట్ యాడ్ చేసి వుంటే లేటెస్ట్ అప్ డేట్ గా వుండేదేమో?