బాబు చేస్తే ముద్దు… జగన్ చేస్తే తప్పు

కాపు నేస్తంపై దుష్ప్రచారం చేస్తున్న పవన్ వ్యాఖ్యలు చాలా కామెడీగా ఉన్నాయన్నారు మంత్రి కురసాల కన్నబాబు. జగన్ ఏ మంచి పని చేసినా అది పవన్ కు తప్పుగా కనిపిస్తుందని, అదే చంద్రబాబు ఏం…

కాపు నేస్తంపై దుష్ప్రచారం చేస్తున్న పవన్ వ్యాఖ్యలు చాలా కామెడీగా ఉన్నాయన్నారు మంత్రి కురసాల కన్నబాబు. జగన్ ఏ మంచి పని చేసినా అది పవన్ కు తప్పుగా కనిపిస్తుందని, అదే చంద్రబాబు ఏం చేసినా అది పవన్ కు మంచిగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

“కాపులకు కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ, వాళ్లకు లబ్ది చేకూరుస్తుంటే అది పవన్ కల్యాణ్ కు తప్పుగా కనిపిస్తోంది. కాపులకు డబ్బులిస్తే కులాల మధ్య వైరుధ్యాలు పెరుగుతాయని విచిత్రమైన వాదన చేస్తున్నారు. కాపుల్లోని పేదలకు ఆర్థిక సహాయం చేస్తే ఏ కులాలు వ్యతిరేకిస్తాయో పవన్ చెప్పాలి. కులరహిత రాజకీయాలని చెబుతూ ప్రతిరోజూ కుల ప్రస్థావన తీసుకొస్తుంటారు.”

కాపు ఉద్యమం జరిగిన రోజుల్లో చంద్రబాబు కాపులపై అక్రమ కేసులు బనాయిస్తే, అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఆ కేసుల్ని ఎత్తేశారనే విషయాన్ని పవన్ గుర్తించాలన్నారు కన్నబాబు. కాపులను చంద్రబాబు మోసం చేసినప్పుడు ప్రశ్నించని పవన్, ఇప్పుడు కులాల మధ్య చిచ్చు కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

“ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ ఆనాడు బాబు హయాంలో ఎందుకు మాట్లాడలేదు. కాపులకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేస్తే ఆనాడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదు. వెయ్యి కోట్లు ఇస్తామని బాబు వంద కోట్లు ఇస్తే పవన్ ప్రశ్నించలేదు. 2వేల కోట్లు ఇస్తామని చెప్పి 4వేల కోట్ల రూపాయలకు పైగా ఇస్తే జగన్ ను ప్రశ్నిస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరం”

చంద్రబాబును పవన్ కల్యాణ్ ఓ ప్రపంచ సంస్కర్తగా చూడడం మానుకోవాలని సూచించారు కన్నబాబు. పూర్తి సమాచారం తెలుసుకొని పవన్ మాట్లాడాలని అన్నారు. 

కాపులను దారుణంగా మోసం చేసింది ఎవరో అందరికంటే పవన్ కళ్యాణ్ కే బాగా తెలుసు

నాయకుడంటే అర్థం తెలిసింది