ప్రేయసి కోసం సినిమా!

ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు అన్న పాట ఊరికనే పుట్టలేదు. ఇలాంటి హీరో ను చూసే పుట్టి వుంటుంది. అందమైన మల్టీ టాలెంటెడ్ హీరో తన కన్నా ఏడెనిమిదేళ్ల పెద్దదైన అమ్మాయిని…

ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు అన్న పాట ఊరికనే పుట్టలేదు. ఇలాంటి హీరో ను చూసే పుట్టి వుంటుంది. అందమైన మల్టీ టాలెంటెడ్ హీరో తన కన్నా ఏడెనిమిదేళ్ల పెద్దదైన అమ్మాయిని ఇష్టపడ్డాడు. అమ్మాయి అందగత్తె కాదు. కానీ తా వలచింది రంభ కదా? కొంత కాలంగా ఆ ఇద్దరూ లివిన్ టు గెదర్ అని టాలీవుడ్ కోడై కూస్తుంటుంది. కానీ ఎన్నాళ్లిలా? ఇదే అనుమానం ఆ గ్యాసిప్ వినే వారికే కాదు, సదరు హీరో కూడా కలిగింది. అందుకే పెళ్లి ప్రపోజల్ పెట్టేసాడని టాక్.

కానీ చిత్రంగా అమ్మాయి వైపు నుంచి ఎస్ అన్న సమాధానం రావాల్సింది పోయి నో అన్న ఆన్సర్ వచ్చిందట. దాంతో కుర్రాడి బుర్ర తిరిగిపోయింది. అర్జంట్ గా అమెరికా వెళ్లి ఓ వారం పది రోజుల వుండి సేద తీరాల్సి వచ్చిందట. ఆ తరువాత తేరుకుని ఇండియా వచ్చాడు.

సరే, అది అలా వుంటే ఇప్పుడు ఆ ప్రేయసిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ నిర్మాతగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడట. నేరుగా ఆ అమ్మడు నిర్మాతగా సినిమా ప్లాన్ చేస్తున్నాడట సదరు హీరో. ప్రేమ గుడ్డిదే కాదు మంచిది కూడా అనుకోవాలేమో ఇప్పుడు.