కిషోర్ తిరుమలతో ‘సితార’

యంగ్ టాలెంట్ ఎక్కడ వుంటే అక్కడ రుమాలు వేస్తున్నాయి పాపులర్ నిర్మాణ సంస్థలు. మైత్రీ, సితార, షైన్ సినిమా లాంటివి అన్నీ ఈ విషయంలో తెగ పోటీ పడుతున్నాయి. కాస్త విషయం వున్న దర్శకులను…

యంగ్ టాలెంట్ ఎక్కడ వుంటే అక్కడ రుమాలు వేస్తున్నాయి పాపులర్ నిర్మాణ సంస్థలు. మైత్రీ, సితార, షైన్ సినిమా లాంటివి అన్నీ ఈ విషయంలో తెగ పోటీ పడుతున్నాయి. కాస్త విషయం వున్న దర్శకులను పట్టుకుని అడ్వాన్స్ లు ఇచ్చి, సినిమాను లైన్ లో పెడుతున్నాయి.

ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, తాజగా రెడ్ సినిమాలు అందిస్తున్న డైరక్టర్ కిషోర్ తిరుమల త్వరలో ఓ సినిమాను సితార బ్యానర్ లో చేయబోతున్నారు. ఇప్పటికే సితార బ్యానర్ లో డైరక్టర్ ల జాబితా చాలా పెద్దదే వుంది. అవసరాల శ్రీనివాస్, రాహుల్ రవీంద్రన్, దగ్గర నుంచి ఇప్పటి కిషోర్ తిరుమల వరకు. ఇంకా మరి కొంత మందితో కూడా అగ్రిమెంట్లు చేసుకుని, 2021 లో చకచకా సినిమాల ప్లాన్ చేస్తున్నట్లు బోగట్టా.

నాయకుడంటే అర్థం తెలిసింది

మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ ?