12 కోట్ల రెమ్యూనిరేష‌న్ ఇస్తే ఓకే అన్న హీరోయిన్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు పూర్తిగా డబ్బే ప్ర‌ధానం అన‌డానికి ఏ మాత్రం వెనుకాడుతున్న‌ట్టుగా లేరు! పాత్ర‌లు, ఔచిత్యాలు సంగ‌త‌లా ఉంటే.. డ‌బ్బును దృష్టిలో ఉంచుకుని వారు సినిమాల‌ను ఒప్పుకోవ‌డం, ఒప్పుకోక‌పోవ‌డం పూర్తిగా ఓపెన్ గా…

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు పూర్తిగా డబ్బే ప్ర‌ధానం అన‌డానికి ఏ మాత్రం వెనుకాడుతున్న‌ట్టుగా లేరు! పాత్ర‌లు, ఔచిత్యాలు సంగ‌త‌లా ఉంటే.. డ‌బ్బును దృష్టిలో ఉంచుకుని వారు సినిమాల‌ను ఒప్పుకోవ‌డం, ఒప్పుకోక‌పోవ‌డం పూర్తిగా ఓపెన్ గా జ‌రుగుతున్న‌ట్టుగా ఉంది. 

ఇటీవ‌లే నటి దీపిక ఒక సినిమా నుంచి త‌ప్పుకుంది. కేవ‌లం ఆర్థిక ప‌ర‌మైన వ్య‌వ‌హారంతోనే ఆమె ఆ సినిమాను వ‌దులుకుంద‌ట‌. అందులో ఆమె భ‌ర్త ర‌ణ్ వీర్ న‌టిస్తున్నాడు. ఆమెకు కెరీర్ లో మంచి మంచి హిట్స్ ను ఇచ్చిన సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఆ సినిమాకు ద‌ర్శ‌కుడు.

అలాంటిది ఆ సినిమా నుంచి దీపిక వైదొలిగిందంటే కేవ‌లం డ‌బ్బే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.  ఆ సినిమాలో న‌టించాలంటే త‌న‌కు టాప్ రెమ్యూనిరేష‌న్ ఇవ్వాల‌ని దీపిక డిమాండ్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ విష‌యంలో ద‌ర్శ‌క‌, నిర్మాత కాస్త ఆలోచ‌న‌లో ప‌డ‌టంతో దీపిక ఆ సినిమా నుంచి త‌ప్పుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

డ‌బ్బు త‌ప్ప మ‌రే ప్ర‌యారిటీ లేద‌ని దీపిక అలా స్ప‌ష్ట‌త ఇచ్చింది. ఇక క‌రీనా క‌పూర్ అయితే సీత పాత్ర‌లో న‌టించ‌డానికి 12 కోట్ల రూపాయ‌ల రెమ్యూనిరేష‌న్ డిమాండ్ చేస్తోంద‌ట‌. రామాయ‌ణం ఆధారంగా బాలీవుడ్ లో ఇప్పుడు వ‌ర‌స సినిమాలు వ‌స్తున్నాయి. వాటిల్లో ఒక దాంట్లో సీత‌గా క‌రీనాను అనుకుంటున్నార‌ట‌. ఈ క్ర‌మంలో ఆమె షాకింగ్ రెమ్యూనిరేష‌న్ ఫిగ‌ర్ ను చెప్పింద‌ట‌. త‌న పారితోషికం 12 కోట్ల రూపాయ‌ల‌ని, ఇస్తే ఓకే లేక‌పోతే నో అని  క‌రీనా స్ప‌ష్టం చేసింద‌ట‌.

ఇలా బాలీవుడ్ హీరోయిన్లు డ‌బ్బే త‌మ ఫ‌స్ట్ ప్ర‌యారిటీ అని స్ప‌ష్టం చేస్తున్నారు. ఏవో భారీ సినిమాలు, పేరు తెచ్చే పాత్ర‌లు, వంద‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ సినిమాలు అనే ప్ర‌చారాల‌కు వాళ్లు పెద్ద ప్ర‌యారిటీ ఇవ్వ‌డం లేద‌ని ఇలా స్ప‌ష్టం అవుతోంది. త‌మ పారితోష‌క‌మే ప్ర‌ధానం త‌ప్ప‌.. ఇత‌ర హంగులూ ఆర్బాటాల‌కూ వారు కించిత్ ప్రాధాన్యత‌ను కూడా ఇవ్వ‌డం లేన‌ట్టుగా ఉంది.