కోతిపుండు బ్రహ్మరాక్షసి

ఇది తెలుగులో చాలా పాప్యులర్ సామెత! కోతికి చిన్న పుండు అయితే చాలు.. దాన్ని కెలికి కెలికి.. బ్రహ్మరాక్షసి పుండులాగా చేసుకుంటుందని.. దాని మానాన అది మానిపోయేలా కోతి ఊరుకోదని ఈ సామెతనీతి! ప్రస్తుతం…

ఇది తెలుగులో చాలా పాప్యులర్ సామెత! కోతికి చిన్న పుండు అయితే చాలు.. దాన్ని కెలికి కెలికి.. బ్రహ్మరాక్షసి పుండులాగా చేసుకుంటుందని.. దాని మానాన అది మానిపోయేలా కోతి ఊరుకోదని ఈ సామెతనీతి! ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు (చోరీ/మాయం) వ్యవహారం కూడా.. ఈ సామెత నీతిని గుర్తుకుతెచ్చే లాగానే ఉంది. స్పీకరుగా తన వ్యవహార సరళితోను, ఇప్పుడు ఫర్నిచర్ కంప్యూటర్ల తరలింపు వ్యవహారంతోను వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన కోడెల శివప్రసాదరావు… తాజాగా హైకోర్టును ఆశ్రయించడంతో ఇలాంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.

దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన హైదరాబాదులోని అసెంబ్లీ ఫర్నిచర్ మరియు కంప్యూటర్లు మాయం అయ్యాయనేది ఆరోపణ. వీటిని అప్పటి స్పీకరు హైదరాబాదు నుంచి తరలించి, నాలుగులారీల్లో తన సొంత ప్రైవేటు క్యాంపు కార్యాలయానికి, తన కుటుంబానికి చెందిన షోరూముకు తరలించారనేది ఇప్పటిదాకా జరిగిన ప్రచారం. ఇదేదో మామూలు ఫర్నిచర్ గొడవ కాదు. హైదరాబాదు అసెంబ్లీలో.. అంటే నిజాం కాలం నాటి అత్యంత విలువైన ఆంటిక్ వేల్యూ ఉన్న ఫర్నిచర్ ను ఆయన తన సొంతానికి తరలించుకున్నారు.

తీరా ప్రభుత్వం దాని గురించి ప్రశ్నించేసరికి… కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దాన్ని తీసుకెళ్లిపోవాల్సిందిగా.. తాను అసెంబ్లీకి లేఖ రాశానని వారు స్పందించకుండా.. ఇప్పుడు తనపై ఆరోపణలు చేస్తున్నారని కోడెల అంటున్నారు. ఈ వివాదం ముదిరింది. మధ్యలో కోడెలకు గుండెపోటు కూడా వచ్చింది. గుంటూరులో తన అల్లుడికే చెందిన హాస్పిటల్ లో ఆయన చేరారు. ఈలోగా ఆయన మీద తుళ్లూరులో శాసనసభ అధికారులు కేసు పెట్టారు.

ఇప్పుడు తాజాగా కోడెల హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ను తీసుకువెళ్లేలా అసెంబ్లీ అధికారుల్ని ఆదేశించాలని ఆయన కోరుతున్నారు. దీంతో ఈ చిన్న వ్యవహారం.. ఎంత బాగా ముదరగలదో.. అంతవరకు ముదిరింది. ప్రభుత్వం కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకోవడంతో.. విచారణ మంగళవారం జరగనుంది. అయితే.. అసెంబ్లీ వర్గాలు కూడా ఫర్నిచర్ నే అడుగుతున్నాయి.

కోడెల కూడా, వాటిని తీసుకెళ్లపోమని అంటున్నారు… ఇక మధ్యలో కోర్టును ఆశ్రయించింది ఎందుకో సామాన్య ప్రజలకు తెలియని సంగతి. చూడబోతే.. తాను ఎప్పటినుంచో తీసుకెళ్లమంటున్నా.. వాళ్లు తీసుకెళ్లడం లేదు.. నా మీద నింద వేయడానికే అలా చేస్తున్నారు.. అని చాటడానికి ఆయన ఈ ఎత్తు వేసినట్లుగా ప్రజలు అనుకుంటున్నారు.

తరలించరు.. కానీ తగ్గిస్తారు!