చాలాకాలంగా ఒక ఆస్ట్రేలియన్ తో ఇలియానా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తమ ప్రేమ బంధాన్ని ఇలియానా ఎప్పుడో వివరించి చెప్పింది. ఇన్ స్టాగ్రమ్ లో అతడితో కలిసి దిగిన ఫొటోలను తరచూ పోస్టు చేసేది ఈ నటీమణి. వీరిద్దరికీ పెళ్లి జరిగిందని కూడా ప్రచారం జరిగింది. ఎంగేజ్ మెంట్ అయ్యిందని ముందుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పెళ్లి వార్తలు వచ్చాయి.
అయితే వాటిని ఇలియానా ధ్రువీకరించలేదు. అతడితో తరచూ ఫొటోలు దిగడాన్ని మాత్రం ఆపలేదు. అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ తనను అందంగా తీసిన ఫొటోలను కూడా ఇలియానా రెగ్యులర్ గా పోస్టు చేసేది. అలా సాగిన ఇలియానా ప్రేమకథ గురించి ఇప్పుడు బ్రేకప్ వార్తలు వస్తూ ఉండటం గమనార్హం.
ఈ ఊహాగానాలకు కారణం ఇన్ స్టాగ్రమ్ లో తన బాయ్ ఫ్రెండ్ ను ఇలియానా అన్ ఫాలో కావడమే. అలాగే అతడితో తను గతంలో దిగిన ఫొటోలను కూడా ఇలియానా డిలీట్ చేసిందట. దీంతో.. బాయ్ ఫ్రెండ్ తో ఇలియానాకు బ్రేకప్ అయ్యిందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ అంశం గురించి ఇలియానా అధికారికంగా ఇంకా ఏం ప్రకటించలేదు.