డీఎంకే అధికార ప్రతినిధి సైదాయ్ సాదిక్ తమిళనాడు బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్లు ఐటమ్స్ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ సర్వీసెస్ శాఖ మంత్రి మనో తంగరాజ్ ఆర్కే నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన డీఎంకే నేత సైదాయ్ సాదిక్, నటులుగా పనిచేస్తున్న బీజేపీ మహిళా నేతలను కించపరిచే పదజాలంతో దూషించారు.
తమిళనాడు బీజేపీలో నలుగురు ఐటమ్స్ ఉన్నారని అందులో ఖుష్బూ పెద్ద ఐటమ్ అంటూ మాట్లాడారు. అమిత్ షా తలమీద వెంట్రుకైనా మొలుస్తేందేమో కానీ తమిళనాడులో మాత్రం కమలం వికసించదన్నారు. డీఎంకే నేత వివాదస్పద వ్యాఖ్యలు తీవ్ర దూమరం రేగడంతో సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'అడవారిని మొగవారు దుర్భాషలాడారంటే వారు ఎలాంటి వాతావరణంలో పుట్టిపెరిగారో అర్థమవుతుందని… ఇదేనా ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో విరాజిల్లుతున్న ద్రవిడ సంస్కృతి' అంటూ ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించడంతో.. స్టాలిన్ సోదరి కనిమొళి బహిరంగ క్షమాపణ చెబుతు, ముఖ్యమంత్రి స్టాలిన్ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని చెప్పారు.
అనంతరం అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన సాదిక్ క్షమాపణలు చెప్పుతూ.. కుష్బూతో సహా ఏ నాయకుడిని బాధపెట్టాలనే ఉద్దేశం లేదని క్షమాపణ చెప్పుతూ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై డీఎంకే మంత్రులను పందులు, జంతువులు పోల్చాడని బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.