అలీ ఫ్యామిలీ ఆనందానికి అవ‌ధుల్లేవ్!

హాస్య న‌టుడు, వైసీపీ మైనార్టీ నాయ‌కుడు అలీ ఫ్యామిలీ ఆనందానికి అవ‌ధుల్లేవు. ఏపీ ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుడిగా రెండేళ్ల కాలానికి అలీని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అలీ, ఆయ‌న…

హాస్య న‌టుడు, వైసీపీ మైనార్టీ నాయ‌కుడు అలీ ఫ్యామిలీ ఆనందానికి అవ‌ధుల్లేవు. ఏపీ ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుడిగా రెండేళ్ల కాలానికి అలీని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అలీ, ఆయ‌న భార్య జుబేదా క‌లిసి ఓ వీడియోను విడుద‌ల చేశారు. అలీని గుర్తించి, ప‌ద‌వి క‌ట్ట‌బెట్టి, త‌మ ఇంట్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డానికి సీఎం జ‌గ‌న్ కార‌ణ‌మంటూ జుబేదా అమితానందాన్ని వ్య‌క్తం చేశారు.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అలీ వైసీపీలో చేరారు. ఆ పార్టీ విజ‌యానికి త‌న వంతు కృషి చేశారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అలీకి ఫ‌లానా ప‌ద‌వులు ఇస్తారంటూ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగింది. మూడున్న‌రేళ్ల పాల‌న పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో అలీకి ఎలక్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారు ప‌ద‌వి ల‌భించ‌డం విశేషం.

అలీ భార్య జుబేదా ఆనందం చూస్తే…ఆ కుటుంబం ఎంత ఖుషీగా వుందో అర్థం చేసుకోవ‌చ్చు. అలీకి ఏ ప‌ద‌వి వ‌స్తుంద‌ని చాలా కాలంగా బంధువులు, మిత్రులు అడుగుతున్నార‌ని, ఇప్పుడా ప్ర‌శ్న‌ల‌కు, టెన్ష‌న్‌కు స‌మాధానంగా ప‌ద‌వి దొరికింద‌ని ఆమె సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఇదంతా త‌మ జ‌గ‌న‌న్న అభిమానం అంటూ ఆమె కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. అలీ స్పందిస్తూ  తాను ఏ ప‌ద‌వీ ఆశించ‌కుండా వైసీపీలో చేరాన‌న్నారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి జ‌గ‌న్‌ను క‌లిసిన త‌ర్వాత‌, త‌న ప‌ద‌విపై త్వ‌ర‌లో శుభ‌వార్త చెబుతాన‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

త‌న‌కు జ‌గ‌న్ అప్ప‌గించిన బాధ్య‌త‌ల్ని ఫుల్ ఫిల్ చేస్తాన‌ని అలీ అన్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న త‌న కూతురి పెళ్లికి జ‌గ‌న్ ఇచ్చిన గిఫ్ట్‌గా భావిస్తున్న‌ట్టు అలీ చెప్ప‌డం విశేషం.