నాని.. నో కమిట్ మెంట్

హీరో నాని తరువాత సినిమా ఏమిటి? ఇలా అనుకోగానే నాగచైతన్యతో మజిలీ సినిమా అందించిన శివ నిర్వాణతో సినిమా అన్న గ్యాసిప్ ఎక్కడ పడితే అక్కడ వినిపించేసింది. వినిపిస్తోంది కూడా. అయితే అసలు విషయం…

హీరో నాని తరువాత సినిమా ఏమిటి? ఇలా అనుకోగానే నాగచైతన్యతో మజిలీ సినిమా అందించిన శివ నిర్వాణతో సినిమా అన్న గ్యాసిప్ ఎక్కడ పడితే అక్కడ వినిపించేసింది. వినిపిస్తోంది కూడా. అయితే అసలు విషయం ఏమిటంటే, నాని ఇప్పటికి ఏ ఒక్క డైరక్టర్ కు కూడా కమిట్ మెంట్ ఇవ్వలేదన్నది.

ఒకరు కాదు ఇద్దరు కాదు అయిదారుగురు డైరకర్లు నానికి లైన్ చెప్పారు. వాళ్లలో శివ నిర్వాణ కూడా వున్నారు. సుధీర్ వర్మ, రాహుల్ రవీంద్రన్, తమిళ దర్ళకుడు వినోద్, హను రాఘవపూడి, ఇంకో మరో ఒకరిద్దరు కూడా లైన్ లో వున్నారు.

ప్రస్తుతం అమెరికా వెళ్లిన నాని వెనక్కు వచ్చాక, వీళ్లలో ఎవరి కథను ఓకె అంటారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అందరి కథలు వినాలి, ఏది ఎగ్జయిటింగ్ గా అనిపిస్తుందో దానికి ఓటేయాలి. అప్పుడు కమిట్ మెంట్, అనౌన్స్ మెంట్. అప్పటి వరకు ఖాళీగా వున్న ప్రతి డైరక్టర్ పేరు నాని సినిమా కోసం వినిపిస్తూ వుంటుంది.

తరలించరు.. కానీ తగ్గిస్తారు!