జగన్ కి కరోనా అంటే భయం లేదా..?

జగన్ మాస్క్ వేసుకోరు, సామాజిక దూరం పాటించరంటూ ఈమధ్య సోషల్ మీడియాలో కారుకూతలు ఎక్కువయ్యాయి. అలాంటి వారందరికీ ఆయన పాటించే పద్ధతులే సమాధానం. అవును, జగన్ మాస్క్ వేసుకోరు. తనకి తాను ఎప్పుడూ ఎవరికీ…

జగన్ మాస్క్ వేసుకోరు, సామాజిక దూరం పాటించరంటూ ఈమధ్య సోషల్ మీడియాలో కారుకూతలు ఎక్కువయ్యాయి. అలాంటి వారందరికీ ఆయన పాటించే పద్ధతులే సమాధానం. అవును, జగన్ మాస్క్ వేసుకోరు. తనకి తాను ఎప్పుడూ ఎవరికీ దగ్గరగా రారు కాబట్టి ఆయనకు మాస్క్ అవసరం లేదు, ఇక సామాజిక దూరం అంటారా.. సీఎం స్థాయి వ్యక్తిని కలిసే ప్రతి ఒక్కరినీ కచ్చితంగా పరీక్షచేసే లోపలికి పంపిస్తారు. ఇక వారికి కూడా దూరంగా ఉంటూ లేనిపోని బిల్డప్ లు ఇవ్వడం జగన్ కి ఇష్టంలేదు కాబట్టే, ఆయన ఎవరినీ దూరం పెట్టరు.

కరోనా గురించి, వైరస్ వ్యాప్తి గురించి పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి దేశంలో జగన్ మాత్రమే. ఎందుకంటే.. చాలా సాధికారికంగా ఆ వ్యాధి గురించి ముందుగా మాట్లాడింది జగన్. కరోనాకి పారాసెట్మాల్ తప్ప మరో మందు లేదని కుండబద్ధలు కొట్టిన తొలి నాయకుడు సీఎం జగన్, దానితో కలసి సహజీవనం చేయాల్సిందేనని నిజాన్ని నిర్భయంగా బైటపెట్టిన ముఖ్యమంత్రి కూడా ఈయనే. అప్పట్లో ఈ వ్యాఖ్యలు చేసినందుకు జగన్ పై విమర్శలు వెల్లువెత్తినా అదే నిజం. ఇంత అవగాహనతో ఉన్నారు కాబట్టే కరోనాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎప్పుడు మాస్క్ పెట్టుకోవాలో జగన్ కు బాగా తెలుసు.

ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని కలవడం వంటి ఒకటీ రెండు సందర్భాల్లో మాత్రమే ఆయన మాస్క్ ధరించారు. సంక్షేమ కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా చెక్కులు అందుకునే సమయంలో అభిమానంతో తన దగ్గరకి వచ్చే లబ్ధిదారులను, ఆయా వర్గాల ప్రతినిధులను జగన్ ఎప్పుడూ నిరాశ పరచలేదు. కరోనా కారణంగా తన చుట్టూ తాను గిరికీసుకోలేదు, ఇతరులనూ దూరం పెట్టలేదు. కరోనాకి భయపడి ఇళ్లకే పరిమితమైపోయిన సోకాల్డ్ మేథావుల్లో జగన్ లేరు. “నా జీవితం ప్రజలకే అంకితం అంటూ సినిమా డైలాగులు కొట్టి, కరోనా టైమ్ లో నేను బైటకొస్తే కుటుంబం పరిస్థితి ఏంటి”? అనే చెత్త లాజిక్ లు కూడా ఆయన వెదకరు.

మనం ద్వేషించాల్సింది వ్యాధిని కానీ, రోగిని కాదు.. అనే ప్రాథమిక సూత్రాన్ని కచ్చితంగా పాటిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారు సీఎం జగన్. “కరోనాపై భయం పెంచుకోవద్దు, అవగాహన పెంచుకోండి..” తనపై విమర్శలు చేసే వాళ్లందరికీ జగన్ తన చేతల ద్వారా చెబుతోంది ఇదే.

నాయకుడంటే అర్థం తెలిసింది