వెంకీ అట్లూరికి అలారమ్

తొలి ప్రేమ, మిస్టర్ మజ్ఞు సినిమాల తరువాత వెంకీ అట్లూరి అందించిన సినిమా రంగ్ దే. మంచి బ్యానర్, కాంబినేషన్ మార్కెట్ కు మించిన ఖర్చు, మాంచి టెక్నికల్ టీమ్ ఇన్నీ ఇచ్చినా దర్శకుడు…

తొలి ప్రేమ, మిస్టర్ మజ్ఞు సినిమాల తరువాత వెంకీ అట్లూరి అందించిన సినిమా రంగ్ దే. మంచి బ్యానర్, కాంబినేషన్ మార్కెట్ కు మించిన ఖర్చు, మాంచి టెక్నికల్ టీమ్ ఇన్నీ ఇచ్చినా దర్శకుడు వెంకీ పెర్ ఫెక్ట్ మూవీ ఇవ్వలేకపోయారని అనిపించేసుకున్నారు. 

రంగ్ దే మీద వచ్చిన ఫస్ట్ కంప్లయింట్, దర్శకుడు మళ్లీ తన తొలి సినిమా తొలిప్రేమనే అటూ ఇటూ చేసి తీసారన్నది. అంతే కాదు, తీసిన మూడు సినిమాల కథలు పెద్దగా భిన్నం కాదని కామెంట్లు బలంగా వినిపించాయి. 

పైగా వెంకీ మీద పడిన మరో కామెంట్ డైరక్టర్ గా ఓకె కానీ రైటింగ్ పార్ట్ లో ఫెయిల్ అవుతున్నారని. రంగ్ దే చూసిన వారంతా ఈ సినిమాకు మంచి రైటర్ తోడై వుంటే ఎమోషనల్ సీన్లలో మరింత బలమైన డైలాగులు పడి వుండేవని. యాక్టర్లు వీలయినంత వరకు సీన్లను పండించారు కానీ కొత్త, బలమైన డైలాగులు పడక, సీన్లు కొత్తగా అనిపించలేదని. 

రంగ్ దే సినిమాలో జనానికి నచ్చింది రిచ్ నెస్, కలర్ ఫుల్ పిక్చరైజేషన్. ఈ రెండింటికి వెంకీ అట్లూరికి క్రెడిట్ రాదు. రిచ్ నెస్ అనేది ఖర్చుతో, ఆర్ట్ డైర్టర్, సినిమాటోగ్రాఫర్ కాంబినేషన్ తో వస్తుంది. ఆర్డ్ డైరక్టర్ ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ కలిసి ఆ మ్యాజిక్ చేసారు. 

అదే సినిమాను చాలా వరకు నిలబెట్టింది. దీనికి కనుక వెంకీ రైటింగ్ పార్ట్, కొత్త ఐడియాలు తోడయి వుంటే సినిమా పెద్ద హిట్ అయి వుండేది. అందువల్ల ఇక నాలుగో సినిమాకు అయినా వెంకీ అట్లూరి మేలుకోవాల్సి వుంది. 

తొలి సినిమా హిట్. మలిసినిమా యావరేజ్, మూడో సినిమా కూడా డిటో. అందువల్ల ఇకనైనా కొత్తగా ఆలోచించాలి.కొత్త రైటింగ్ స్కిల్స్ చూపించాలి. లేదూ అంటే టాలీవుడ్ లోకి ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త నెత్తురుతో వెంకీ అట్లూరి పోటీ పడడం కష్టం.