ఆచార్య-తొందరపడడం లేదు

దాదాపు మూడున్నరేళ్లు అయిపోతోంది దర్శకుడు కొరటాల శివ సినిమా వచ్చి. ప్రస్తుతం నిర్మాణంలో వున్న ఆచార్య సినిమా అక్టోబర్ లో విడుదలవుతుందని అందరూ ఆశించారు. కానీ అలా జరిగేట్లు కనిపించడం లేదు.  Advertisement పైగా…

దాదాపు మూడున్నరేళ్లు అయిపోతోంది దర్శకుడు కొరటాల శివ సినిమా వచ్చి. ప్రస్తుతం నిర్మాణంలో వున్న ఆచార్య సినిమా అక్టోబర్ లో విడుదలవుతుందని అందరూ ఆశించారు. కానీ అలా జరిగేట్లు కనిపించడం లేదు. 

పైగా ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయాలని దర్శకుడు కొరటాల ఆలోచిస్తున్నారని, ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందించారని వార్తలు వచ్చాయి. తాము వస్తామని వార్తలు వస్తే పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' అదే వెనక్కు తగ్గుతుందని కొరటాల భావించినట్లుంది.

కానీ భీమ్లానాయక్ యూనిట్ వెనక్కు తగ్గలేదు సరికదా, ఇటవల పవన్ బర్త్ డే సందర్భంగా ఆంధ్ర అంతటా సంక్రాంతి విడుదల అంటూ సిక్స్ షీట్ పోస్టర్లు విపరీతంగా పేస్ట్ చేసారు. ఇది చూసి ఆచార్య బయ్యర్లు 'కొరటాల' సన్నిహితులను ఎంక్వయిరీ చేస్తే, తాము సంక్రాంతికే అని మళ్లీ చెప్పినట్లు తెలుస్తోంది. 

ఆచార్య షూటింగ్ వర్క్ ఇంకా పెండింగ్ వుంది. ఆర్ఆర్ఆర్ విదేశీ షూట్ నుంచి రామ్ చరణ్ రాగానే ఆచార్య షెడ్యూలు జరగాల్సింది కానీ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. 

ఈ నెల 20 నుంచి కొత్త షెడ్యూలు వేసినట్లు బోగట్టా. అంటే ఈ లెక్కన ఇక అక్టోబర్ బరిలోకి ఆచార్య రావడం లేదన్నది పక్కా. మరి సంక్రాంతి సంగతి తేలాలి. అదీ కాకుంటే ఇంకెప్పుడో?