‘తెల్లవారితే’ వాష్ అవుట్!

మత్తు వదలరా సినిమాతో ప్రామిసింగ్ అనిపించుకున్నాడు సింహా కోడూరి. సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు. అలాంటి హీరోతో అదే ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు సాయి కొర్రపాటి సినిమా నిర్మిస్తున్నారు అంటే కాస్త ఆసక్తికరం.  Advertisement…

మత్తు వదలరా సినిమాతో ప్రామిసింగ్ అనిపించుకున్నాడు సింహా కోడూరి. సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు. అలాంటి హీరోతో అదే ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు సాయి కొర్రపాటి సినిమా నిర్మిస్తున్నారు అంటే కాస్త ఆసక్తికరం. 

పైగా ఆ మధ్య వచ్చిన కలర్ ఫోటో సినిమాలో నిర్మాణ భాగస్వామిగా వున్న బెన్నీ భాగస్వామిగా వున్నారు అంటే మరికాస్త ఆసక్తి. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన 'తెల్లవారితే గురువారం' సినిమా విడుదలకు ముందే నాన్ థియేటర్ రైట్స్ మొత్తం సింగిల్ విండో కింద అమ్ముడయిపోయాయి. 

మూడున్నర కోట్లకు విక్రయించారని తెలిసి,సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది. కానీ సినిమా విడుదలతోనే ఆ బజ్ అంతా నీటి బుడగలా పేలిపోయింది. ఒక్క మల్టీ ఫ్లెక్స్ లో షో ఫుల్ అయిపోయినట్లు స్క్రీన్ షాట్ లు హీరోనే స్వయంగా సోషల్ మీడియాలోకి వదిలి హడావుడి చేసినా సుఖం లేకపోయింది.

మార్నింగ్ షో నుంచే సినిమా డిజాస్టర్ లుక్ లోకి జారిపోయింది. దానికి తోడు సినిమాకు ఆల్ మోస్ట్ ఆల్ మైనస్ రివ్యూలు వచ్చాయి. దాంతో సినిమా కలెక్షన్లు ఎక్కడా నాలుగు అంకెలు దాటలేదు. తొలి మూడు రోజులు గడిచిపోయినా, థియేటర్ రెంట్లు కూడా కిట్టుబాటయ్యేలా కనిపించడం లేదు పరిస్థితి. 

మంచి నిర్మాత, మంచి మనసున్న నిర్మాత అయిన సాయి కొర్రపాటి ని, మనమంతా దగ్గర నుంచి పరాజయాలు వెన్నాడుతున్నాయి. వాటి జాబితాలో ఇదీ చేరిపోయింది.