వకీల్ సాబ్ రేట్లు..బాబోయ్

పవర్ స్టార్ పవన్ తో నిర్మాత దిల్ రాజు నిర్మించిన సినిమా వకీల్ సాబ్. రెండు మూడేళ్ల తరువాత పవన్ నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్ పిచ్చి ఊపుతో వున్నారు. ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్…

పవర్ స్టార్ పవన్ తో నిర్మాత దిల్ రాజు నిర్మించిన సినిమా వకీల్ సాబ్. రెండు మూడేళ్ల తరువాత పవన్ నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్ పిచ్చి ఊపుతో వున్నారు. ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్ లో చూస్తామా అనే ఉత్సాహంతో వున్నారు. 

ఇప్పుడు ఈ ఉత్సాహాన్నే క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు బయ్యర్లు. సినిమాను ఆంధ్ర ఏరియాకు 42 కోట్ల రేషియోలో విక్రయించారు. ఆ రేంజ్ ను సినిమా అందుకోవాలి అంటే అరి వీర బ్లాక్ బస్టర్ కావాలి. కానీ మొదటి మూడు రోజుల్లోనే మాగ్జిమమ్ లాగేయాలని బయ్యర్లు చూస్తున్నారు. 

నిర్మాత దిల్ రాజు తనే ఉంచుకున్న వైజాగ్ లో అర్థరాత్రి దాటాక మూడు బెనిఫిట్ షో లు ప్లాన్ చేస్తున్నారు. దీనికి టికెట్ రేటు 1500 ఫిక్స్ చేసారు. అలాగే తెల్లవారు ఝామున కొన్ని షోలు ప్లాన్ చేస్తున్నారు వాటికి అయిదు వందలు రేటు పెట్టారు. ఇక తొలివారం యూనిఫారమ్ రేటు 200 ఫిక్స్ చేసారు.

ప్రతి ఏరియాలో తొలి రోజు టికెట్ ల కోసం ఇటు పవన్ అభిమానులు, అటు జనసేన అభిమానులు, ఇక మెగాభిమానులు విడివిడిగా బయ్యర్ల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఇది క్యాష్ చేసుకోవడానికి మూడు వందల నుంచి అయిదు వందల రేటున గుత్తగా టికెట్ లను ఇచ్చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నారు. 

మొత్తం మీద కొనుగోలు చేసిన మొత్తంలో కనీసం యాభై శాతానికి పైగా తొలి రెండు రోజుల్లోనే వసూలు చేసుకోవాలనే ఆలోచనలో వకీల్ సాబ్ బయ్యర్లు వున్నారు. వరుస సెలవులు రావడం అన్నది సినిమాకు అడ్వాంటేజ్ గా వుంది. 

అలాగే ముందు వారం విడుదలయ్యే సీటీ మార్ వాయిదా పడింది. వైల్డ్ డాగ్ కు థియేటర్లు కేవలం వన్ వీక్ కే ఎక్కువగా అగ్రిమెంట్ లు చేసారు. సుల్తాన్ ఎలాగూ డబ్బింగ్ సినిమా. ఈ మొత్తం పరిస్థితి వకీల్ సాబ్ కు అనుకూలంగా మారింది. 

అవును ఇంతకీ తన ఫ్యాన్స్ కు తన సినిమా ను రీజనబుల్ రేట్లలో చూపించకుండా ఇంత భారీ రేట్లు పెట్టి దోచేసుకోవడాన్ని ఓ రాజకీయ నాయకుడిగా,హీరోగా పవన్ ఎలా ఓకె అనేసారో? తన యాభై కోట్ల రెమ్యూనిరేషన్, తన షేర్ తనకు చాలు మిగిలినవి తనకు అనవసరం అనా? ఏమో?