ఇప్పటికే పలువురు నటీమణులు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ లో తమ లక్ ను పరీక్షించుకున్నారు. మరి కొందరు క్యూలో ఉన్నారు. ఇటీవలే తన సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ద్వారా కీర్తీ సురేష్ ప్రేక్షకులను పలకరించింది. దానికి మిశ్రమ స్పందన వచ్చింది. కీర్తీ సురేష్ సినిమా పట్ల సామాన్య ప్రేక్షకులు అక్కడ పెదవి విరిచారు. ఆ సినిమా థియేటర్లో విడుదలయి ఉంటే డిజాస్టర్ అయ్యేదని, అందుకే ఓటీటీకి ఇచ్చి భారం దించేసుకున్నట్టున్నారనే విశ్లేషణలూ వినిపించాయి. ఏతావాతా ఆ సినిమాకు సామాన్య ప్రేక్షకుల నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వచ్చింది.
కీర్తీ సురేష్ కు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అలాంటి అనుభవాన్ని ఇచ్చింది. ఇక ఇప్పుడు నిత్యామీనన్ వంతు వచ్చింది. ఈమె వెబ్ సీరిస్ లోనే నటిస్తున్నట్టుగా ఉంది. జూలై ఒకటిన అందుకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేస్తున్నారట. బ్రీత్ ఇన్ టు ది షాడోస్ పేరుతో ఈ వెబ్ సీరిస్ రూపొందిందట. అభిషేక్ బచ్చన్ మరో ప్రధాన పాత్రను చేశాడు. ఈ వెబ్ సీరిస్ కూడా థ్రిల్లర్ అనే తెలుస్తోంది.
వివిధ రకాల కొటేషన్లతో ఈ వెబ్ సీరిస్ కు సంబంధించి పోస్టులు పెడుతున్నారు. ఇలా నిత్యామీనన్ డిజిటల్ స్ట్రీమింగ్ లో తన లక్ ను పరీక్షించుకుంటూ ఉంది. జూలై 10న ఈ వెబ్ సీరిస్ ప్రారంభం కాబోతోందట. ఇప్పటికే సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ వంటి వెబ్ సీరిస సెకెండ్ సీజన్ కు ఓకే చెప్పింది. మరి నిత్యా, సమంత వంటి వాళ్లకు డిజిటల్ స్ట్రీమింగ్ లో తొలి తొలిగా ఎలాంటి అనుభవాలు మిగులుతాయో!