తమ జూనియర్ ఆర్టిస్టులతో అవసరం మేరకు అవతారాలు ఎత్తిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఝలక్ తగిలింది. ఎన్నికల సమయంలో తమ యాడ్ లలో నటించిన శేఖర్ చౌదరి అనే జూనియర్ ఆర్టిస్టును ఇటీవల రైతుగా చూపిస్తూ ప్రభుత్వాన్ని నిందింపజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆ జూనియర్ ఆర్టిస్టు ధ్వజమెత్తాడు. అంతటితో ఆగకుండా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్రవ్యాఖ్యలు చేశాడు.
మంత్రిని పట్టుకుని ఆయన కులవృత్తిని నిందిస్తూ మాట్లాడాడు ఆ జూనియర్ ఆర్టిస్టు. ఇలా ఒక కుల వృత్తిని కించపరుస్తూ మంత్రిని తిట్టడంపై విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ఫిర్యాదులు కూడా నమోదు అయ్యాయి. ఈ విషయంలో అనేకమంది ఫిర్యాదులు చేశారు.
మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పేరు శేఖర్ చౌదరి అనితేలింది. అతడి వివరాలన్నింటినీ సోషల్ మీడియా బయటపెట్టింది. ఇలాంటి నేపథ్యంలో ఫిర్యాదు డీజీపీ వరకూ వెళ్లింది. దీంతో శేఖర్ చౌదరిని పట్టుకున్నారు. ఆయన అరెస్టును ఏపీ పోలీసులు ధ్రువీకరించారు. ఈ వ్యవహారం గురించి ఆయనను విచారిస్తున్నట్టుగా పోలీసులు పేర్కొన్నారు.