ఆఫ్గానిస్తాన్ ను ఆక్రమించేసిన తాలిబన్ల చూపు పోర్న్ సైట్ల మీద పడింది. తమ దేశం పరిధిలో వచ్చే పోర్న్ సైట్లను వారు ప్రత్యేకంగా వీక్షిస్తున్నారట. ఇంతకీ ఉన్నట్టుండి వారికి పోర్న్ మీద ఎందుకు దృష్టి మళ్లింది? అంటే.. వాటిల్లో నటించిన స్త్రీలను చంపడానికి అని తెలుస్తోంది!
తాలిబన్ల నిషేధిత అంశాల్లో ఒకటి పోర్న్. మగవాళ్లు పోర్న్ వీక్షించడాన్ని షరియా చట్టం అభ్యంతరం చెప్పదేమో కానీ, ఆడవాళ్లు అందులో నటిస్తే మాత్రం సహించేది లేదని తాలిబన్లు అంటున్నారట.
పోర్న్ సినిమాల్లో నటించిన అఫ్గన్ మహిళలను గుర్తించే పనిలో పడ్డారట తాలిబన్లు. అందుకోసం వెబ్ సైట్లను చెక్ చేస్తున్నారట. అలా చెక్ చేసి, నటించిన మహిళలను గుర్తించి, వారిని వెదికి పట్టి చంపడం ప్రస్తుతం తాలిబన్లు పెట్టుకున్న పనిగా తెలుస్తోంది. అందుకోసమే ప్రత్యేకంగా పోర్న్ సైట్లను చెక్ చేస్తున్నారట.
కేవలం పోర్న్ సినిమాల్లో నటించిన వారినే కాదు, వేశ్యలను కూడా చంపడానికి తాలిబన్లు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. గత ఇరవై యేళ్లలో మారిన పరిస్థితుల దృష్ట్యా ఆప్గానిస్తాన్ లో వేశ్యలుగా పని చేసుకున్న వాళ్లు, విదేశీయులతో కలిసి పోర్న్ సినిమాల్లో నటించిన వారు ఉన్నారని తాలిబన్లు గుర్తించారట.
ఇప్పుడు అలాంటివారందరినీ గుర్తించి చంపడమే వీరి పనిగా తెలుస్తోంది. వేశ్యలను వదిలే ప్రసక్తి లేదని.. వారిని చంపడమే పరిష్కారమని తాలిబన్లు భావిస్తున్నారట. అయినా గత ఇరవై యేళ్ల పరిణామాల్లో అందరినీ క్షమించేసినట్టుగా తాలిబన్లు ఇది వరకూ ప్రకటించారు. అయితే వారి మార్కు హింస, దుర్మార్గాలు మాత్రం ఆగేలా లేవు.
ఎలాగూ అక్కడ ఏం జరుగుతోందని వాస్తవాలు చెప్పే మీడియా లేదు కాబట్టి.. తాలిబన్లు అన్ని రకాల దుర్మార్గాలకూ తెగబడుతున్నట్టుగా ఉన్నారు. ఆఖరికి వీడియోలు వెదికి మరీ పోర్న్ సినిమాల్లో నటించిన వారిని చంపే ప్రయత్నాలు చేస్తుండటం తాలిబన్ల చేష్టలకు పరాకాష్టగా మారినట్టుగా ఉంది.